కూటమి సీట్లలో బీసీలకు ప్రాధాన్యతివ్వాలి: కృష్ణయ్య

r krishnaiah coments bc reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి వర్గాలు బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాయని ఆశిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం పేర్కొం ది. గురువారం బీసీ భవన్‌లో 12 బీసీ సంఘాల సమావేశం జరిగింది. బీసీలకు చట్టసభల్లో రిజ ర్వేషన్లు ఇచ్చే అంశంపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో దీనిపై స్పష్టత ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం కోరింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ కూటమి సీట్లలో బీసీలకు ప్రాధాన్యతివ్వాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top