
డబ్బులు పంచుతూ దొరికిన తెలుగు తమ్ముళ్లు
ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ తెలుగు దేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ తెలుగు దేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటమిలో భయంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారు. పలు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు డబ్బులు, మద్యం పంచుతూ పోలీసులకు చిక్కారు.
* చిత్తూరు జిల్లా నగరిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు మద్యం, స్వీట్స్ ప్యాకెట్లు పంచిపెడతూ టీడీపీ కార్యకర్తలు పోలీసులకు చిక్కారు. కులం పేరుతో చిత్తూరులో టీడీపీ నాయకుల విందు భోజనాలు ఏర్పాటు చేశారు. సదుం మండలం జోగివారిపల్లిలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. మొలకలచెరువు మండలం చౌడసముద్రంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని 12 కేసుల మద్యం సీసాలు పట్టుకున్నారు.
* అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ముగ్గురు జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు.
* కర్నూలు జిల్లా సంజామల మండలం రాంరెడ్డిపల్లిలో టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి, రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
* ప్రకాశం జిల్లా దర్శి పుట్టబజార్‌లో ఇద్దరు టీడీపీ కార్యకర్తల అరెస్ట్ చేసి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
* విశాఖ జిల్లా కంచరపాలెంలోని కోనేరు జోగారావు నగర్‌లో ఇంటింటికి రూ.500 చొప్పున టీడీపీ-బీజేపీ టీడీపీ-బీజేపీ కార్యకర్తలు పంచిపెట్టారు.
* గుంటూరు జిల్లా చిలకలూరిపేట 12వ వార్డులో నలుగురు టీడీపీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు.