16న రాష్ట్రానికి సోనియా | Sonia Gandhi for Karimnagar on April 16 | Sakshi
Sakshi News home page

16న రాష్ట్రానికి సోనియా

Apr 11 2014 2:50 AM | Updated on Mar 18 2019 8:56 PM

16న రాష్ట్రానికి సోనియా - Sakshi

16న రాష్ట్రానికి సోనియా

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 16న రాష్ట్రానికి వస్తున్నారు. అదేరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

* కరీంనగర్ సభకు హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి

 సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 16న రాష్ట్రానికి వస్తున్నారు. అదేరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సోనియాగాంధీ తొలుత ఈనెల 15న వస్తున్నట్లు టీపీసీసీకి సమాచారమిచ్చారు. అయితే ఆమె ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నందున తెలంగాణ పర్యటన 16కు మారింది. ఆరోజు మధ్యాహ్నం కరీంనగర్ బహిరంగసభలో సోనియా పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గురువారం తెలిపారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. అయితే టీపీసీసీ వర్గాలు మాత్రం ఈనెల 17న ఆయన తెలంగాణలో పర్యటించేందుకు సుముఖంగా ఉన్నారని చెప్పాయి. రాహుల్ డైరీలో ఆ ఒక్కరోజు మాత్రమే ఖాళీగా ఉందని, వరంగల్ జిల్లాలో నిర్వహించే సభకు హాజరవ్వాలని ఆయన ఆసక్తి చూపుతున్నారనేసమాచారం తమకు అందిందని పేర్కొన్నాయి. సోనియా సభ 16న నిర్వహిస్తుండగా, ఆ మరుసటిరోజే రాహుల్ వస్తే పెద్దగా ప్రభావం ఉండదని, దీనికితోడు జన సమీకరణ కష్టసాధ్యమనే భావనలో టీపీసీసీ నేతలు ఉన్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement