తన సొంత సొంత నియోజకవర్గం లక్నోలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ బుధవారం నుంచి ప్రచారం ప్రారంభించారు.
తన సొంత సొంత నియోజకవర్గం లక్నోలో బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ బుధవారం నుంచి ప్రచారం ప్రారంభించారు. బుధవారం ఉదయమే ఆయన లక్నో చేరుకున్నారు. ముందుగా పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించారు. మూడు రోజుల పాటు లక్నోలోనే ఉండి ప్రచార కార్యక్రమాలు చూసుకుంటారు. హజ్రత్గంజ్లో కూడా ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికులు, వైద్యులు, న్యాయవాదులు, షియా మత పెద్దలతో సమావేశమవుతారు.
ఇప్పటికే గత వారం రోజులుగా రాజ్నాథ్ కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి పంకజ్ సింగ్, రాజ్నాథ్ భార్య సావిత్రి సింగ్ ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుత ఎంపీ లాల్జీ టాండన్ ఈ సీటు వదులుకోడానికి మొదట్లో కాస్త ముందు వెనక ఆడినా, తర్వాత సర్దుకుపోయి రాజ్నాథ్ తరఫున స్వయంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకుముందు లక్నో స్థానానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రాతినిధ్యం వహించారు.