రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్.. మేయర్ అభ్యర్థి భర్త అరెస్టు | police take mayor husband into custody in rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్.. మేయర్ అభ్యర్థి భర్త అరెస్టు

Mar 30 2014 10:06 AM | Updated on May 29 2018 4:06 PM

రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్.. మేయర్ అభ్యర్థి భర్త అరెస్టు - Sakshi

రాజమండ్రిలో పోలీసుల ఓవరాక్షన్.. మేయర్ అభ్యర్థి భర్త అరెస్టు

రాజమండ్రిలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమండ్రి మేయర్ అభ్యర్థిని షర్మిలారెడ్డి భర్త అనిల్ రెడ్డిని రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాజమండ్రిలో కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజమండ్రి వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థిని షర్మిలారెడ్డి భర్త అనిల్ రెడ్డిని రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన అనిల్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లిపోయారని, అసలు ఎందుకు తీసుకెళ్లారో కూడా తెలియట్లేదని షర్మిలారెడ్డి తదితరులు తెలిపారు. వాళ్లంతా వన్ టౌన్ పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు కూర్చున్నారు. టీడీపీ నాయకుల చెప్పుడు మాటలు విన్న పోలీసులు కుట్రతో తమను అణిచేయాలనే ఇలా చేస్తున్నారని, అసలు ఏం వ్యవహారం జరుగుతోందో తమకు అర్థం కావట్లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు.

రాత్రికి రాత్రి కుట్రపన్ని, పొద్దున్నే కనీసం తమ ఓటుహక్కు కూడా వినియోగించుకోకుండానే అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. రాజమండ్రిలో 35 సీట్లకు పైగా కైవసం చేసుకుని, మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే పరిస్థితి ఉందని, అందుకే తమను అణిచేయడానికి టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇలా చేశారని ఆరోపించారు. ఉదయాన్నే రాజమండ్రి మూడో వార్డుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు బుచ్చయ్య చౌదరి వచ్చారని, అనిల్ రెడ్డి ఇక్కడ ఉంటే ఓటింగ్ బాగా జరుగుతుందని పోలీసులకు చెప్పి, ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఎప్పుడో 28వ తేదీన ఒక గొడవ జరిగిందని, అందులో కూడా అనిల్ రెడ్డి లేరని, అయినా ఇప్పుడు ఆయనను తీసుకెళ్లడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

అయితే, అనిల్ రెడ్డిని తాము అరెస్టు చేయలేదని,ఇరు వర్గాలకు చెందిన నాయకులు గొడవ పడతారన్న ఉద్దేశంతో తాము ముందు జాగ్రత్తగా తీసుకొచ్చినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రెండు పార్టీల నాయకుల మధ్య గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతోనే తాము అదుపులోకి తీసుకున్నామన్నారు. కనీసం ఆయనతో మాట్లాడించాలని మీడియా కోరినా.. అందుకు అనుమతించకుండా, లోపలకు తీసుకెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement