అటల్‌జీ స్థాయి.. అటల్‌జీదే! | narendra Modi will become PM, can't be compared to Vajpayee says Advani | Sakshi
Sakshi News home page

అటల్‌జీ స్థాయి.. అటల్‌జీదే!

Apr 5 2014 10:35 PM | Updated on Aug 16 2018 4:01 PM

అటల్‌జీ స్థాయి.. అటల్‌జీదే! - Sakshi

అటల్‌జీ స్థాయి.. అటల్‌జీదే!

గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ శనివారం నామినేషన్ వేశారు.

గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి బీజేపీ అగ్రనేత అద్వానీ శనివారం నామినేషన్ వేశారు. నామినేషన్ వేసే సమయంలో అద్వానీతో పాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఉన్నారు. ఈ సందర్భంగా మోడీని సమర్థుడైన పాలకుడిగా అద్వానీ అభివర్ణించారు. ‘మోడీని నేను ఎవరితోనూ పోల్చలేను. ముఖ్యంగా అటల్‌జీ (అటల్ బీహారీ వాజ్‌పేయి)తో అస్సలు పోల్చలేను. అటల్‌జీ స్థాయి అటల్‌జీదే. పార్టీ ప్రధాన సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఆ సిద్ధాంతాలను పాలనలో అమలుపరిచింది అటల్‌జీ’ అని  అద్వానీ స్పష్టం చేశారు.

 

గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన తనకెన్నడూ లేదని ఎల్‌కే అద్వానీ స్పష్టం చేశారు. తాను పోటీ చేసే స్థానానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement