కృష్ణా జిల్లా నందిగామ 19వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ ఎన్నికలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
కృష్ణా జిల్లా నందిగామ 19వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ ఎన్నికలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితా తారుమారు కావడం వల్లే ఇలా వాయిదా వేసినట్లు తెలిసింది.
మరోవైపు కర్నూలు జిల్లా నంద్యాల 34వ వార్డులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాల ఎర చూపింది. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు డబ్బు పంపిణీకి తెగబడ్డారు. ఈ తతంగంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఊరుకుండిపోయారు.