జార్ఖండ్‌లో మందుపాతరకు 8 మంది బలి | maoists landmine claim 8 lives in jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో మందుపాతరకు 8 మంది బలి

Apr 25 2014 8:28 AM | Updated on Oct 9 2018 2:51 PM

జార్ఖండ్‌లో మందుపాతరకు 8 మంది బలి - Sakshi

జార్ఖండ్‌లో మందుపాతరకు 8 మంది బలి

జార్ఖండ్‌లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు పేట్రేగిపోయారు. డుమ్‌కా జిల్లాలోని డుమ్‌కా లోక్‌సభ స్థానానికి గురువారం పోలింగ్ ముగిసిన అనంతరం వాహనంలో తిరిగి వెళ్తున్న పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా శక్తివంతమైన మందుపాతర పేల్చారు.

డుమ్‌కా (జార్ఖండ్): జార్ఖండ్‌లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు పేట్రేగిపోయారు. డుమ్‌కా జిల్లాలోని డుమ్‌కా లోక్‌సభ స్థానానికి పోలింగ్ ముగిసిన అనంతరం వాహనంలో తిరిగి వెళ్తున్న పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా శక్తిమంతమైన మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు పోలింగ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులు మృతి చెందారు.

జిల్లాలోని షికారీపరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అస్నజోర్ సమీపంలో ఈ దాడికి పాల్పడ్డారు. ఆరో దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జార్ఖండ్‌లో డుమ్‌కాతోపాటు రాజ్ మహల్, గొడ్డా, ధన్‌బాద్ స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. మరోవైపు, అసోంలోని కోక్రాఝర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారుల దాడిలో ఒక కానిస్టేబుల్ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement