'దొంగ ఎవరో..దొర ఎవరో ప్రజలకు తెలుసు' | Harish rao takes on jairam ramesh, ponnala lakshmaiah | Sakshi
Sakshi News home page

'దొంగ ఎవరో..దొర ఎవరో ప్రజలకు తెలుసు'

Apr 21 2014 2:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

'దొంగ ఎవరో..దొర ఎవరో ప్రజలకు తెలుసు' - Sakshi

'దొంగ ఎవరో..దొర ఎవరో ప్రజలకు తెలుసు'

తెలంగాణలో దొంగ ఎవరో... దొర ఎవరో ప్రజలకు తెలుసు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో దొంగ ఎవరో... దొర ఎవరో ప్రజలకు తెలుసు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన సోమవారం తెలంగాణా భవన్లో మాట్లాడుతూ తెలంగాణకు అడుగడుగునా ఢోకా చేసిన పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు టీడీపీ, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.

జైరాం రమేష్కు అడవులపైన అవగాహన ఉందే తప్ప తెలంగాణ ఉద్యమంపై లేదని ఎద్దేవా చేశారు. పొన్నాల లక్ష్మయ్య స్రిప్ట్ రాసిస్తే దాన్ని జైరాం చదువుతున్నాడరన్నారు. కేసీఆర్ను విమర్శించే అర్హత జైరాంకు లేదని హరీష్ రావు అన్నారు. ఇక తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో కూడా టీడీపీ గెలవదని హరీష్ జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement