దుర్మార్గుడు.. నీచుడికి ఓటేస్తారా? | chandrababu fire on kcr | Sakshi
Sakshi News home page

దుర్మార్గుడు.. నీచుడికి ఓటేస్తారా?

Apr 29 2014 12:01 AM | Updated on Oct 8 2018 5:19 PM

దుర్మార్గుడు.. నీచుడికి ఓటేస్తారా? - Sakshi

దుర్మార్గుడు.. నీచుడికి ఓటేస్తారా?

కేసీఆర్.. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే.. మాయల ఫకీరును మించిపోయాడు.

- అతనో మాయల ఫకీరు.. నోరుతెరిస్తే అన్నీ అబద్దాలే  
- కేసీఆర్‌పై చంద్రబాబు ధ్వజం
 - నోరు జారితే జైలుకు పంపుతా
- సైకిల్‌తో తొక్కించి పచ్చడి చేస్తా

 
 ఇల్లెందు/మహబూబాబాద్, న్యూస్‌లైన్: ‘‘ కేసీఆర్.. నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే.. మాయల ఫకీరును మించిపోయాడు. ఇలాంటి నీచుడికి ఓట్లేస్తారా తమ్ముడూ’’.. అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన బహిరంగ సభలో, వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో సోమవారం నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన ప్రసంగించారు.  మనముందు పెద్ద సవాల్ ఉందని, అన్ని రంగాల్లో అవినీతిమయమైన కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని, అదే సందర్భంలో కేసీఆర్‌లాంటి అబద్దాల కోరు గెలవడానికి వీలులేదని చెప్పారు.

 బంగారు తెలంగాణ, నవ తెలంగాణ నిర్మాణం జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణలో రైతులు, డ్వాక్రా మహిళలు, బీడీ కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించాలంటే ఢిల్లీలో మోడీ ప్రభుత్వం.. తెలంగాణలో బీసీముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కాలన్నారు.

 ఎంత తిట్టినా తక్కువే..
 కేసీఆర్ దుర్మార్గుడు, అవినీతి కోరు, సన్నాసి, క్రమశిక్షణ లేని వ్యక్తి.. ఆయనను ఎంత తిట్టినా తక్కువేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. కేసీఆర్.. అనవసరంగా నోరు జారితే శాశ్వతంగా జైలుకు పంపుతానని హెచ్చరించారు. కేసీఆర్‌ను సైకిల్‌తో తొక్కించి పచ్చడి పచ్చడి చేస్తానన్నారు. సోనియాగాంధీ అవినీతి అనకొండ అని.. ఊరుకో అనకొండను తయారు చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యూరు. రాహుల్‌గాంధీ మెద్దుబాబు అని.. అతడికి ఏమీ తెలియదని విమర్శించారు.

 

‘బాబు’పైకి చెప్పు విసిరిన యువకుడు
గజ్వేల్: టీడీపీ అధినేత చంద్రబాబుపైకి ఓ యువకుడు చెప్పు విసిరాడు. సోమవారం మెదక్ జిల్లా గజ్వేల్ సభలో బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. సైకిల్‌కు అడ్డం వస్తే.. తొక్కేస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించిన నేపథ్యంలో.. సభలో జనాల మధ్య ఉన్న జగదేవ్‌పూర్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనూహ్యంగా లేచి.. ‘తెలంగాణ వ్యతిరేకి.. గో బ్యాక్’ అంటూ చెప్పును  చంద్రబాబుపైకి విసిరాడు. అయితే, ఈ ప్రయత్నంలో చెప్పుకొంత దూరం వెళ్లి కింద పడింది. దీంతో టీడీపీ కార్యకర్తలు  ఆ యువకునిపై మూకుమ్మడిగా దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement