సైన్స్ మెథడాలజీలో టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ | science methodology coaching for TET and DSC | Sakshi
Sakshi News home page

సైన్స్ మెథడాలజీలో టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ

Published Tue, Aug 27 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

సైన్స్ మెథడాలజీలో టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ

సైన్స్ మెథడాలజీలో టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ

జీవశాస్త్ర బోధన ఉపగమాలు- పద్ధతులు 1. ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఆశించే వ్యక్తులకు సమర్థవంతంగా అందిం చడాన్ని ఏమంటారు? ఎ) ప్రవర్తన బి) అభ్యసన సి) బోధన డి) అన్వేషణ

జీవశాస్త్ర బోధన ఉపగమాలు- పద్ధతులు
 1. ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ జ్ఞానాన్ని ఆశించే వ్యక్తులకు సమర్థవంతంగా అందిం చడాన్ని ఏమంటారు?
     ఎ) ప్రవర్తన    బి) అభ్యసన
     సి) బోధన    డి) అన్వేషణ
 2.    అనుభవం ద్వారా విద్యార్థిలో ప్రవర్తనా మార్పులను కలిగించే ప్రక్రియ..?
     ఎ) బోధన    బి) అభ్యసన
     సి) శిక్షణ    డి) క్రమశిక్షణ
 3.     జీవశాస్త్రంలో వాడుతున్న ఆగమన, నిగ మన ఉపగమాలను ప్రత్యేక బోధనా పద్ధతు లుగా ఉపయోగిస్తున్న శాస్త్రం?
     ఎ) రసాయన శాస్త్రం  బి) భౌతిక శాస్త్రం
     సి) సాంఘిక శాస్త్రం డి) గణిత శాస్త్రం
 4. ‘బోధనా పద్ధతులు విద్యార్థికి కేవలం జ్ఞానా న్ని ప్రసాదించేవే కాకుండా, ఆశించిన విలు వలు, చక్కటి దృక్పథాలు, పని చేయడంలో అభ్యసనాన్ని కలిగించేలా ఉండాలి’ అని చెప్పినవారు..?
     ఎ) కొఠారి    బి) తారాదేవి రిపోర్‌‌ట
     సి) లక్ష్మణస్వామి మొదలియార్
     డి) రామస్వామి అయ్యంగార్
 5. ‘ప్రాథమిక దశలో విజ్ఞానశాస్త్రం.. వ్యవసా యం, పరిశ్రమల మధ్య సన్నిహిత  సంబం ధానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేలా ఉండా లి’ అని పేర్కొన్నవారు..?
     ఎ) కొఠారి కమిషన్
     బి) మొదలియార్ కమిషన్
     సి) తారాదేవి రిపోర్‌‌ట
     డి) ఎన్‌సీఈఆర్‌టీ
 6. ఆగమన పద్ధతిలో విషయాలను ఎలా తెలుసుకుంటారు..?
     ఎ) మూర్త విషయాల నుంచి - అమూర్త
         విషయాలు
     బి) అమూర్త నుంచి - మూర్త విషయాలు
     సి) సాధారణ నుంచి - ప్రత్యేకాంశాలు
     డి) సామాన్య సూత్రాల నుంచి - నిర్దిష్ట విషయాలు
 7.    మనోవిజ్ఞాన పద్ధతి కానిది?
     ఎ) అన్వేషణ పద్ధతి    బి) ప్రాకల్పన పద్ధతి
     సి) ఆగమన పద్దతి     డి) నిగమన పద్ధతి
 8.    ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి?
     ఎ) ప్రాకల్పన పద్ధతి
     బి) ప్రయోగ పద్ధతి
     సి) శాస్త్రీయ పద్ధతి     
     డి) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
 9.    ఏ పద్ధతిలో త్వరగా పాఠ్యాంశాన్ని బోధించి సిలబస్‌ను పూర్తి చేయవచ్చు?
     ఎ) అన్వేషణ పద్ధతి      బి) ఉపన్యాస పద్ధతి
     సి) ప్రాకల్పన పద్ధతి  డి) కృత్య పద్ధతి
 10.    ఉపన్యాస పద్ధతి ఏ సందర్భానికి సరైంది?
     ఎ) ప్రయోగాలు చేసేటప్పుడు
     బి) పాఠ్యాంశం పూర్తిగా బోధించడానికి
     సి) ఉన్ముఖీకరణకు     డి) మూల్యాంకనానికి
 11.     విద్యార్థులకు కిరణజన్య సంయోగక్రియలో ఇై2 ఆవశ్యకత అనే ప్రయోగాన్ని ఉపా ధ్యాయుడు చేసి చూపించాడు. ఇది ఏ బోధనా పద్ధతి?
     ఎ) అన్వేషణ పద్ధతి      బి) ప్రాకల్పన పద్ధతి
     సి) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
     డి) పైవేవీ కావు
 12. ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ప్రదర్శించే ఉపకరణాలు ఎలా ఉండాలి?
     ఎ) చిన్నవిగా     బి) బరువుగా
     సి) పెద్దవిగా     డి) తేలికగా
 13.     హ్యూరిస్టో అనే గ్రీకు మాటకు అర్థం?
     ఎ) బిగ్గరగా అరవడం బి) ఆలోచించడం
     సి) ఆచరణ     డి) అన్వేషణ
 14.     అన్వేషణ పద్ధతికి నాంది పలికినవారు?
     ఎ) కొఠారి     బి) మైకేల్ జాన్
     సి) జె.జె.థామ్సన్ డి) హెచ్.ఐ.ఆర్‌‌మస్ట్రాంగ్
 15.    ‘అన్వేషణ పద్ధతిలో జ్ఞానానికి ద్వితీయ స్థానం ఇచ్చారు. అందుకు ఇది ఉపయోగ కరమైన పద్ధతి కాదు’ అని పేర్కొన్నవారు?
     ఎ) హెచ్.ఐ.ఆర్‌‌మస్ట్రాంగ్ బి) జె.జె.థామ్సన్
     సి) మైకేల్ జాన్     డి) పైవేవీ కావు
 16.    ‘అన్వేషణ పద్ధతి అనేది శాస్త్రీయ విధానంలో శిక్షణ ఇచ్చేదిగా ఉండాలి, కానీ జ్ఞానం పొందడం దీని పరమార్థం కాదు’ అని తెలిపినవారు?
     ఎ) వెస్టవే     బి) థామ్సన్
     సి) ఆర్‌‌మస్ట్రాంగ్     డి) మైకేల్ జాన్
 17.    అన్వేషణ పద్ధతిలో సోపానాలు ఏ క్రమంలో ఉంటాయి?
     ఎ) వివరించడం, ప్రయోగాలు, నిర్వచిం చడం, ముగింపు     
     బి) నిర్వచించడం, ప్రయోగాలు, వివ రించడం, ముగింపు
     సి) ముగింపు, నిర్వచించడం, ప్రయో గాలు, వివరణ
     డి) వివరణ, ప్రయోగాలు, నిర్వచించడం, ముగింపు
 18.    విత్తనాలు మొలకెత్తే విధానం అనే అంశా న్ని బోధించడానికి అనువైన పద్ధతి?
     ఎ) అన్వేషణ పద్ధతి     బి) నియోజన పద్ధతి
     సి) ఉపన్యాస పద్ధతి  డి) ప్రాకల్పన పద్ధతి
 19.    కింది వాటిలో అన్వేషణ పద్ధతిలోని పరిమితి?
     ఎ)    ఆత్మవిశ్వాసం     
     బి)    తక్కువ కాలంలో సిలబస్‌ను పూర్తి చేయడం
     సి)    వ్యక్తిగత శ్రద్ధ ఉండకపోవడం
     డి)    విషయాలను తమకు తాము
         నేర్చుకోకపోవడం
 20.    సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో దాని సహజ వాతావరణంలో ఏ పద్ధతిలో ఆ సమస్య పరిష్కారమవుతుంది?
     ఎ) ఉపన్యాస పద్ధతిలో
     బి) ప్రాజెక్ట్ పద్ధతిలో
     సి) అన్వేషణ పద్ధతిలో
     డి) నియోజన పద్ధతిలో
 21. ఒక సంకల్పం కానీ, ఒక ప్రయోజనం కానీ ఉండి సహజ వాతావరణ పరిస్థితుల్లో చేసే క్రియ లేదా ప్రణాళిక?
     ఎ) అన్వేషణ     బి) నియోజనం
     సి) ప్రాజెక్ట్     డి) పరికల్పన
 22. పాఠశాలలో కానీ, పాఠశాల వెలుపల కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి, ఆచరణ ద్వారా సాధించే విధానం..?
     ఎ) అన్వేషణ     బి) నియోజనం
     సి) ప్రాజెక్ట్     డి) పరికల్పన
 23. ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశ పెట్టాలని సూచించిన తొలి వ్యక్తి?
     ఎ) జాన్ డ్యూయి      బి) బల్లార్‌‌డ
     సి) హెన్రీ డేవిడ్     డి) హెచ్.కిల్ ప్యాట్రిక్
 24.    {పాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య అని చెప్పినవారు?
     ఎ) బల్లార్‌‌డ     బి) కిల్ ప్యాట్రిక్
     సి) పార్కర్     డి) జాన్ డ్యూయి
 25.    {పాజెక్ట్ అంటే పాఠశాలలో దిగుమతైన  నిజ జీవిత భాగం అని చెప్పినవారు?
     ఎ) కిల్ ప్యాట్రిక్     బి) స్టీవెన్‌సన్
     సి) బల్లార్‌‌డ     డి) పార్కర్
 26.    లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మక ప్రయ త్నం లేదా ఆలోచనే ప్రకల్పన.. అని తెలి పినవారు?
     ఎ) బల్లార్‌‌డ      బి) పార్కర్
     సి) థామస్ అండ్ లాంగ్
     డి) కిల్ ప్యాట్రిక్
 27.    {పాజెక్ట్ పద్ధతిలో ఉన్న సోపానాల్లో లేనిది?
     ఎ) పరిస్థితిని కల్పించడం
     బి) వ్యూహరచన
     సి) నివేదికను తయారు చేయడం
     డి) వివరించడం
 28.    {పాజెక్ట్‌లను జె.ఎ.స్టీవెన్‌సన్ ఎన్ని విధాలుగా వర్గీకరించాడు?
     ఎ) 1       బి) 2    సి) 3     డి) 4
 29.    కిల్ ప్యాట్రిక్ వర్గీకరణలో.. తోటను పెంచ డం ఏ రకమైన ప్రాజెక్ట్?
     ఎ) ఉత్పత్తి ప్రాజెక్ట్     
     బి) భౌతిక సంబంధ ప్రాజెక్ట్
     సి) వినియోగ ప్రాజెక్ట్
     డి) సమస్యా ప్రాజెక్ట్
 30. విద్యార్థులకు పని-అనుభవం ఏ పద్ధతి ద్వారా నెరవేరుతుంది?
     ఎ) ఉపన్యాస పద్ధతి
     బి) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
     సి) నియోజన పద్ధతి
     డి) ప్రాజెక్ట్ పద్ధతి
 31.    పక్షుల వలస అనే పాఠ్యాంశానికి ఏ బోధనా పద్ధతి అనువైనది?
     ఎ) అన్వేషణ పద్ధతి    బి) ఉపన్యాస పద్ధతి
     సి) ప్రయోగ పద్ధతి     డి) ప్రాకల్పన పద్ధతి
 32.    కింది పాఠ్యాంశాల్లో ప్రాకల్పన పద్ధతికి అనువైనది?
     ఎ) జీర్ణక్రియ     
     బి) శ్వాసక్రియలో ై2 విడుదల
     సి) కోళ్ల పెంపకం     డి) శాస్త్రవేత్తల చరిత్ర
 33.    ఏ పద్ధతిలో బోధించాలంటే విద్యార్థుల సం ఖ్య తక్కువగా ఉండాలి?
     ఎ) ఉపన్యాస       బి) ఉపన్యాస-ప్రదర్శన
     సి) ప్రయోగ పద్ధతి     డి) నియోజన పద్ధతి
 34.    శాస్త్రీయ పద్ధతిలోని సోపానాల్లో మొద టిది?
     ఎ) దత్తాంశ సేకరణ
     బి) సమస్యను గుర్తించడం
     సి) ప్రాకల్పనను ప్రతిపాదించడం
     డి) సాధారణీకరణం
 35.    ఉపగమాలు, బోధనా పద్ధతులు అనేవి..?
     ఎ) ఒకటే     బి) భిన్నమైనవి
     సి) సంబంధం లేనివి
     డి) పరస్పర సంబంధం ఏర్పడనివి
 36.    {పత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యా లను రూపొందించడమే ఆగమనం  అని తెలిపినవారు?
     ఎ) బల్లార్‌‌డ     బి) ఫౌలర్
     సి) జీవన్     డి) కిల్ ప్యాట్రిక్
 37.    మల్లెకు సువాసన ఉంటుంది. సన్నజాజికి,  విరజాజికి కూడా సువాసన ఉంటుంది. ఈ విషయాలను పరిశీలించడం ద్వారా రాత్రి వికసించే పూలలో సువాసన ఉంటుందని  సాధారణీకరించడం దేనికి ఉదాహరణ?
     ఎ) ప్రాకల్పన పద్ధతి  బి) అన్వేషణ పద్ధతి
     సి) ఆగమన పద్ధతి       డి) నిగమన పద్ధతి
 38.    శాస్త్రీయ పద్ధతిలోని సోపానాలను పేర్కొ న్నవారు?
     ఎ) కార్‌‌ల పియర్‌సన్        బి) ఫౌలర్
     సి) కిల్ ప్యాట్రిక్        డి) జీవన్
 39.    సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి?
     ఎ) అన్వేషణ పద్ధతి
     బి) ప్రాకల్పన పద్ధతి సి) శాస్త్రీయ పద్ధతి     డి) పైవన్నీ
 40.    ఆమ్లాలు నీలి లిట్మస్‌ను ఎరుపురంగుకు మారుస్తాయి. ఈ విషయాన్ని ఏఇ కు అన్వయించి చెప్పి నిర్ధారిస్తే అది ఏ ఉపగమం?
     ఎ) ఆగమన     బి) పరికల్పన
     సి) అన్వేషణ     డి) నిగమన
 41. ఏ లాటిన్ పదానికి ‘బిగ్గరగా చదవడం’ అనే అర్థం ఉంది?
     ఎ) ల్యాక్టో      బి) రిక్టర్
     సి) లెక్టేర్     డి)లాఫ్టర్
 42. ఉపన్యాస పద్ధతికి ఉన్న ప్రయోజనాల్లో ఇది ఒకటి?
     ఎ)    శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వొచ్చు
     బి)    ఆచరణ ద్వారా అభ్యసనం సాధ్యం
     సి)    స్పష్టమైన భావ ప్రకటనకు
         తోడ్పడుతుంది
     డి) విద్యార్థుల విషయంలో వ్యక్తిగత శ్రద్ధ
         చూపే వీలుంది
 43. ఆక్సిజన్ తయారీ విధానాన్ని తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు స్వయంగా ప్రయోగం చేసి చూపాడు. అతడు ఏ బోధనా పద్ధతిని అవలంబించినట్లు?
     ఎ) ఉపన్యాస పద్ధతి
     బి) అన్వేషణ పద్ధతి
     సి) ఉపన్యాస-ప్రదర్శన పద్ధతి
     డి) ప్రాజెక్ట్ పద్ధతి
 44. మంచి ప్రదర్శనకు ఉన్న లక్షణాల్లో లేనిది?
     ఎ) ప్రణాళిక     
     బి) లక్ష్యాల స్పష్టత ఉండాలి
     సి) ప్రదర్శనలో విద్యార్థుల సహకారం
         తీసుకోకూడదు
     డి) ఉపకరణాలు చిన్నవిగా ఉండకూడదు
 
 సమాధానాలు
 
     1) సి;    2) ఎ;    3) డి;     4) సి;     5) ఎ;
     6) ఎ;    7) డి;    8) డి;    9) బి;    10) సి;        11) సి;    12) సి;    13) డి;    14) డి;    15) బి;
      16) ఎ;    17) బి;    18) డి;    19) డి;    20) బి;        21) సి;    22) సి;    23) డి;    24) బి;    25) సి;        26) సి;    27) డి;    28) బి;    29) బి;    30) డి;        31) బి;    32) సి;    33) సి;    34) బి;    35) బి;        36) సి;    37) సి;    38) ఎ;    39) సి;    40) డి;        41) సి;    42) సి;    43) సి;    44) సి;     
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement