
స్కూల్ ఎడ్యుకేషన్
మన శరీరంలో నీరు మన శరీరంలో రక్తంతో సహా ప్రతి అవయవంలోనూ ఏదో ఒక రూపంలో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఈ నీటి పరిమాణంలో
మన శరీరంలో నీరు మన శరీరంలో రక్తంతో సహా ప్రతి అవయవంలోనూ ఏదో ఒక రూపంలో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఈ నీటి పరిమాణంలో కొద్దిగా హెచ్చు తగ్గులొస్తే ఏమీకాదు. కానీ నీటి శాతం తగ్గిపోవడం ఒక పరిమితి దాటితే మాత్రం పరిస్థితి విషమిస్తుంది. సాధారణంగా మన శరీర బరువులో 12% బరువుకి సమానమైన నీటిని శరీరం కోల్పోతే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఇలాంటి సమయాల్లో రక్తంలోనే కాకుండా కండరాల్లో కూడా నీటి శాతం తగ్గిపోతుంది.
రక్తంలో ఉండాల్సినంత నీరు లేకపోవడంతో రక్తం చిక్కగా మారుతుంది. అందులోని వివిధ కణాలు ఒకదానితో మరొకటి చేరి ఎక్కడికక్కడ చిన్నచిన్న గడ్డలుగా రూపొందుతాయి. ఇలాంటి గడ్డలతో కూడిన రక్తాన్ని గుండె అన్ని అవయవాలకు పంపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. పైగా ఆ పరిస్థితి గుండెకు కూడా ప్రమాదకరంగానే పరిణమిస్తుంది. వాంతులు- నీళ్ల విరేచనాలు (డయేరియా) వంటివి వచ్చినప్పుడు శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. అందుకే ఇలాంటి సమయాల్లో ఉప్పు-చక్కెర కలిపిన ద్రావణం వంటివి ఎక్కువగా తాగాలని డాక్టర్లు చెబుతుంటారు.