సాంఘికశాస్త్రంలో మెరవాలంటే... | 10th Special | Sakshi
Sakshi News home page

సాంఘికశాస్త్రంలో మెరవాలంటే...

Mar 19 2015 12:57 AM | Updated on Sep 2 2017 11:02 PM

సాంఘికశాస్త్రంలో మెరవాలంటే...

సాంఘికశాస్త్రంలో మెరవాలంటే...

సాంఘికశాస్త్రంలో మెరవాలంటే పేపర్ - ఐ 10th Special

 పేపర్ - ఐ

 1. భారతదేశం-భౌగోళిక స్వరూపాలు
 1.    నీలగిరి పర్వతాల్లో ఎత్తై శిఖరం?
     ఎ) దొడబెట్ట        బి) అనైముడి
     సి) కాంచనగంగ    డి) కార్డమం
 
 2.    రెండు నదుల మధ్య ఉండే భూభాగాల్ని ఏమంటారు?
     ఎ) ద్వీపకల్పం    బి) అంతర్వేది
     సి) డెల్టా        డి) సింధూ శాఖ
 
 3.    టేరాయి అంటే?
     ఎ) అంతర్వేది    బి) తీర మైదానం
     సి) చిత్తడి నేలలు    డి) ఒండ్రు నేలలు
 
 4.    నీలగిరి పర్వతాలు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?

     ఎ) ఊటీ        బి) గూడలూరు
     సి) మెట్టుపాలెం    డి) రామేశ్వరం
 5.    భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించడానికి ఆధారంగా తీసుకున్న రేఖాంశం?
     ఎ) 82బీ డిగ్రీల తూర్పు రేఖాంశం
     బి) 82 డిగ్రీల తూర్పు రేఖాంశం
     సి) 82బీ డిగ్రీల పశ్చిమ రేఖాంశం
     డి) 8 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర రేఖాంశం
 
 6. భారత ప్రామాణిక కాలం గ్రీన్‌విచ్ ప్రామాణిక కాలం కంటే ఎన్ని గంటల సమయం ముందుంటుంది?
     ఎ) 5బీ గంటలు    బి) 5 గంటలు
     సి) 6బీ గంటలు    డి) 6 గంటలు
 
 7.    ఎవరెస్ట్ శిఖరం ఎత్తు?
     ఎ) 8,840 మీటర్లు    బి) 8,848 మీటర్లు
     సి) 8,868 మీటర్లు    డి) 8,828 మీటర్లు
 
 8.    భారతదేశంలోని అతి ఎత్తై పర్వత శిఖరం?
     ఎ) కె2 (గాడ్విన్ ఆస్టిన్)    బి) కాంచనగంగ
     సి) ఎవరెస్ట్        డి) నంగపర్వతం
 
 9.    మేఘాలయలో ఉన్న పర్వతాలు?
     ఎ) ఖాసీ        బి) గారో
     సి) జాంతియా    డి) పైవన్నీ
 
 10.    భాబర్ అంటే?
     ఎ) సారవంతమైన అంతర్వేదులు
     బి) చిత్తడి నేలలు
     సి) గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు
     డి) గులక రాళ్లతో కూడిన సన్నని భూస్వరూపం
 
 సమాధానాలు
 1) ఎ; 2) బి; 3) సి; 4) బి; 5) ఎ; 6) ఎ; 7) బి;
 8) ఎ; 9) డి; 10) డి.
 
 ముఖ్య ప్రశ్నలు ఒకమార్కు
 1.    జీవనది అంటే ఏమిటి?
 జ.    వేసవిలోనూ ఎండిపోకుండా ఏడాదంతా ప్రవహించే నదిని జీవనది అంటారు. ఉదాహరణ: గంగ,యమున    
 2.    ‘కోరల్’ అంటే ఏమిటో తెలపండి?
 జ.    సముద్రంలో జీవించే పగడపు కీటకాలను కోరల్ అంటారు. ఇవి పగడపు దిబ్బల (ప్రవాళ భిత్తికలు)ను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడిన దిబ్బలు దీవులుగా మారుతాయి. ఉదాహరణ: లక్ష దీవులు
 3.    డూన్‌ను నిర్వచించండి?
 జ.    హిమాచల్, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే సన్నని లోయలను డూన్ అంటారు. ఉదాహరణ: డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్.
 4.    అంగారా భూమి అనే దేన్ని అంటారు?
 జ.    {పస్తుతం ఉన్న ఉత్తరమెరికా, యూరప్, ఆసియా ఖండాలు 20 కోట్ల సంవత్సరాల క్రితం ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. దీన్నే అంగారా భూమి లేదా లారెన్షియా భూమిగా పిలిచేవారు. ఇది టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఉండేది.
 5.    గోండ్వానా భూమి అంటే ఏమిటి?
 జ.    {పస్తుతమున్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాల భూభాగంతోపాటు భారతదేశం, మలేషియా వంటి దక్షిణాసియా ప్రాంతాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. దీన్నే గోండ్వానా భూమి అని పిలిచేవారు. ఇది టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉండేది.
 6.    అంతస్థలీయ ప్రవాహం అంటే ఏమిటి?
 జ.    ఎడారుల్లో ప్రవహించే నది సముద్రానికి చేరకుండా ఇసుకలోకి ఇంకి ప్రవహించడాన్ని అంతస్థలీయ ప్రవాహంగా పేర్కొంటారు. ఉదాహరణ: థార్ ఎడారిలోని లూనీ నది.
 7.    హిమాలయ పర్వతాల విస్తరణను తెలపండి?
 జ.    హిమాలయ పర్వతాలు భారతదేశ పడమర నుంచి తూర్పునకు 2,400కి.మీ పొడవున వ్యాపించి ఉన్నాయి. వీటిలో మూడు సమాంతర పర్వత శ్రేణులు న్నాయి. అవి 1. ఉన్నత హిమాలయాలు (హిమాద్రి శ్రేణి), 2. నిమ్న హిమాలయాలు (హిమాచల్ శ్రేణి), 3. బాహ్య హిమాలయాలు (శివాలిక్ శ్రేణి)

 8.    ఇక్కడ ఇచ్చిన రాష్ట్రాల తీర ప్రాంతాల పేర్లు తెలపండి? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ర్ట-గోవా.
 జ.    ఆంధ్రప్రదేశ్-సర్కార్ తీరం; ఒడిశా-ఉత్కల్ తీరం; తమిళనాడు-కోరమాండల్ తీరం; కేరళ-మలబార్ తీరం; కర్ణాటక-కెనరా తీరం; మహారాష్ర్ట-గోవా- కొంకణ్ తీరం.
 
 2 మార్కులు
 1.    హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఎలా ఉండేవి?
 2.    మీకిచ్చిన ప్రపంచ పటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికి గురించి కొన్ని వాక్యాలు రాయండి?
 3.    హిమాలయ పర్వతాల్లోని శ్రేణుల్ని తెలిపి, ఆ శ్రేణుల్లో ఉన్న ముఖ్య ప్రాంతాలను పేర్కొనండి?
 4 మార్కులు
 1.    భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి?
 2.    భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయి?

 3.    మీకిచ్చిన భారతదేశ పటంలో ఈ ప్రదేశాలను గుర్తించండి?
     ఎ) ఎవరెస్ట్ శిఖరం
     బి) గోదావరి నదీ ప్రవాహ మార్గం
     సి) న్యూఢిల్లీ        డి) హైదరాబాద్
 
 4.    దక్కన్ పీఠభూమి భౌగోళిక స్థితిగతుల్లో ముఖ్యాంశాల్ని వివరించండి?
 
 2. అభివృద్ధి భావనలు
 
 1.    అభివృద్ధికి ముఖ్యమైన ప్రామాణికం?
     ఎ) అక్షరాస్యత    బి) జాతీయ ఆదాయం
     సి) సగటు తలసరి ఆదాయం    డి) జాతీయోత్పత్తి
 
 2.    {పపంచ మానవాభివృద్ధి సూచిక-2013 ప్రకారం భారత్‌లో ఆయుఃప్రమాణం?
     ఎ) 65.8 సంవత్సరాలు    బి) 66.8 సంవత్సరాలు
     సి) 67.8 సంవత్సరాలు    డి) 68.8 సంవత్సరాలు
 
 3.    2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ అక్షరాస్యత?
     ఎ) 62.8 శాతం    బి) 61.8 శాతం
     సి) 69.8 శాతం    డి) 64.8 శాతం
 
 4.    2012లో ఏ రాష్ట్రంలో తలసరి ఆదాయం అధికంగా ఉంది?
     ఎ) తమిళనాడు    బి) బీహార్
     సి) తెలంగాణ    డి) పంజాబ్
 
 5.    తమిళనాడులోని ఏ తీర ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పారు?
     ఎ) కూడంకుళం    బి) చెన్నై
     సి) రామేశ్వరం    డి) ట్యుటికోరిన్
 6.    2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత శాతం?
     ఎ) 69     బి) 73    సి) 78.5     డి) 68.9
 
 7.    2013లో భారత తలసరి ఆదాయం ఎన్ని డాలర్లు?
     ఎ) 3,900    బి) 4,000    సి) 5,200    డి) 3,285
 
 8.    ఏ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చిన రాష్ట్రాలు ఎక్కువ ఆర్థికవృద్ధిని సాధిస్తున్నాయి?
     ఎ) విద్యా        బి) వ్యవసాయ
     సి) వ్యాపార        డి) రక్షణ
 
 9.    2012లో బీహార్ తలసరి ఆదాయం?
     ఎ) రూ. 25,000    బి) రూ. 17,000
     సి) రూ. 21,000    డి) రూ. 30,000
 
 10.    శిశు మరణాలు అధికంగా ఉన్న రాష్ట్రం?
     ఎ) తెలంగాణ    బి) మధ్యప్రదేశ్
     సి) బీహార్        డి) ఒడిశా
 
 సమాధానాలు
 1) సి; 2) ఎ; 3) బి; 4) డి; 5) ఎ; 6) బి; 7) డి;
 8) ఎ; 9) ఎ; 10) సి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    జాతీయాదాయాన్ని నిర్వచించండి?
 జ.    ఒక దేశంలో ఏడాది కాలంలో ఉత్పత్తయిన అంత్య వస్తువులు, సేవల విలువల మొత్తం.
 
 2.    తలసరి ఆదాయాన్ని నిర్వచించండి?
 జ.    ఒక సంవత్సర కాలంలో ఒక దేశ మొత్తం జాతీయాదాయాన్ని, ఆ దేశ జనాభాతో భాగించగా వచ్చే మొత్తం.
 
 3.    అభివృద్ధి అంటే ఏమిటి?
 జ:    {పజలు స్వేచ్ఛగా జీవిస్తూ, జీవనానికి తగిన ఆదా యం, భద్రత, గౌరవాన్ని పొందుతూ ఎలాంటి వివక్షతను ఎదుర్కోకుండా నాణ్యమైన జీవన ప్రమాణాల్ని కలిగి ఉండడాన్ని అభివృద్ధి అంటారు.
 
 2 మార్కులు
 1.    అభివృద్ధి అంటే ఏమిటి? వివిధ అభివృద్ధి భావనలను తెల్పండి?
 2.    మన దేశానికి అభివృద్ధి లక్ష్యాలు ఎలా ఉండాలి?
 3.    {పపంచ మానవాభివృద్ధి నివేదిక గురించి తెలపండి?
 
 4 మార్కులు
 1.    ఆడవాళ్లు ఇంటి బయట పనిచేయడానికి, లింగ వివక్షతకూ మధ్య గల సంబంధం ఏమిటి?
 2.    అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు తల్లిదండ్రులు ఎందుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారో చర్చించండి?
 3.    తలసరి ఆదాయం, అక్షరాస్యత స్థాయి, ప్రజల ఆరోగ్య స్థితి మంచిస్థాయిలో ఉండి, శిశుమరణాల రేటు తగ్గించాలంటే ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించండి?
 3. ఉత్పత్తి - ఉపాధి
 
 1.    ఎక్కువగా సహజ ప్రక్రియలు ఉపయోగించి ఏ రంగంలో వస్తువుల్ని ఉత్పత్తి చేస్తారు?
     ఎ) ద్వితీయ        బి) ప్రాథమిక
     సి) తృతీయ        డి) ద్వితీయ, తృతీయ
 
 2.    తోటల పెంపకం, గనుల తవ్వకం ఏ రంగం పరిధిలోకి వస్తాయి?
     ఎ) ద్వితీయ        బి) ప్రాథమిక
     సి) తృతీయ        డి) ద్వితీయ, ప్రాథమిక
 
 3.    2009-10లో స్థూల జాతీయోత్పత్తిలో సేవా రంగం వాటా?
     ఎ) 10-20 శాతం    బి) 20-40 శాతం
     సి) 30-40 శాతం    డి) 50-60 శాతం
 
 4.    2011 లెక్కల ప్రకారం భారతదేశంలో పని చేస్తున్న వారి (శ్రామికులు) సంఖ్య?
     ఎ) 56 కోట్లు        బి) 46 కోట్లు
     సి) 36 కోట్లు        డి) 25 కోట్లు
 
 5.    మహిళలు అధిక శాతం ఏ రంగంలో ఉపాధి పొందుతున్నారు?
     ఎ) పారిశ్రామిక    బి) సేవా
     సి) వ్యవసాయ    డి) రైల్వే
 
 6.    ఏ రంగంలోని కార్మికులు వస్తువులను ఉత్పత్తి చేయలేరు?
     ఎ) పారిశ్రామిక    బి) వ్యవసాయ
     సి) సేవా        డి) వాణిజ్య
 
 7.    ఏ రంగంలో అధిక శాతం కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంది?
     ఎ) అవ్యవస్థీకృత     బి) వ్యవసాయ రంగం
     సి) వ్యవస్థీకృత    డి) మిశ్రమ
 
 8.    భారతదేశ కార్మికుల్లో అధిక శాతం ఏ రంగంలో పని చేస్తున్నారు?
     ఎ) అవ్యవస్థీకృత    బి) వ్యవస్థీకృత
     సి) చిన్న తరహా పరిశ్రమలు
     డి) గ్రామీణ కుటీర పరిశ్రమలు
 
 9.    పత్తి చిచిచిచిఉత్పత్తి, గుడ్డ చిచిచిచిఉత్పత్తి?
     ఎ) పారిశ్రామిక, సహజ    బి) సహజ, పారిశ్రామిక
     సి) సహజ, సహజ
     డి) పారిశ్రామిక, పారిశ్రామిక
 
 10.    భారతదేశంలో ఆర్థిక సంవత్సరం అంటేచిచిచిచినెల నుంచి చిచిచిచినెల వరకు?
     ఎ) ఏప్రిల్ - ఏప్రిల్    బి) జనవరి - డిసెంబ ర్
     సి) మార్చి - ఏప్రిల్    డి) ఏప్రిల్ - మార్చి
 
 సమాధానాలు
 1) బి; 2) బి; 3) డి; 4) సి; 5) సి; 6) బి; 7) సి; 8) ఎ; 9) బి; 10) డి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    ఉపాధి బదిలీ అంటే ఏమిటి?
 జ:    ఒక రంగంలో ఉపాధి క్రమ పద్ధతిలో లభించనపుడు వేరొక రంగంలో ఉపాధి కోసం శ్రామికులు తరలివెళ్లడాన్ని
  ఉపాధి బదిలీ అంటారు.
 
 2.    వ్యవస్థీకృత రంగాన్ని వివరించండి?
 జ:    ఉపాధికి సంబంధించిన నియమాలు ఉండి, నమ్మకంగా పని లభించే వ్యాపార సంస్థలు. ఈ రంగంలో ఒక క్రమ పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలున్న భారీ పరిశ్రమలు, వ్యవసాయ రంగాలుంటాయి. ఈ రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత, నియమిత వేతనాలు ఉంటాయి.
 
 3.    అవ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి?
 జ:    {పభుత్వ నియంత్రణ లేకుండా, ఎలాంటి నియమాలు అనుసరించకుండా ఉండే చిన్న వ్యాపార సంస్థలు. ఈ రంగంలోని కార్మికులకు నియమిత పనివేళలు, వేతనాలు, ఉద్యోగ భద్రత ఉండవు. కుటీర,చిన్న,అల్ప తరహా పరిశ్రమల్లో పనిచేసేవారు, రోజు కూలీలు, చేతి వృత్తులు వారు ఈ రంగంలోకి వస్తారు.
 
 4.    {పచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏమిటి?
 జ:    అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఒక పనిలో నిమగ్నమైనప్పుడు వారిలో కొంతమంది పని మానేసినా ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేనట్లైతే ఆ పని మానేసినవారిని ప్రచ్ఛన్న నిరుద్యోగులు అంటారు. మన దేశ వ్యవసాయ రంగంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది.
 
 2 మార్కులు
 1.    సేవా రంగం ఇతర రంగాల కంటే ఎలా భిన్నమైంది? కొన్ని ఉదాహరణలతో వివరించండి?
 2.    వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలంటే ఏమిటి?
 3.    నోటు పుస్తకం, కారు, కంప్యూటర్‌లు తుది ఉత్పాదకాలైతే, వాటి మధ్య దశ ఉత్పాదకాలను తెలపండి?
 4 మార్కులు
 1.    ఆర్థిక కార్యకలాపాల్ని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించడం ఉపయోగకరమేనా? వివరించండి?
 2.    భారతదేశంలో 1972-73, 2009-10 సంవత్సరాల్లో ఉపాధి, స్థూల జాతీయోత్పత్తి ఎంత శాతం ఉందో తెలిపి దానిపై వ్యాఖ్యానించండి?
 
 4. భారతదేశ శీతోష్ణస్థితి
 
 1.    ఆంధ్రప్రదేశ్‌లో తొలకరి జల్లులను ఏ జల్లులు అంటారు?
     ఎ) వేసవి        బి) చల్లని    
     సి) ఆరెంజ్        డి) మామిడి
 
 2.    2013లో (ఐ్కఇఇ) ఐపీసీసీ సమావేశం ఏ నగరంలో జరిగింది?
     ఎ) టోక్యో     బి) వార్సా     సి) పారిస్ డి) వియన్నా
 
 3.    ఐలా తుపాన్ (2009) కారణంగా ఏ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది?
     ఎ) సుందర్‌బన్స్    బి) పశ్చిమ తీరం
     సి) దక్షిణ కోస్తా    డి) ఉత్తర కోస్తా
 
 4.    కోరమాండల్ ప్రాంతంలో అధిక వర్షానికి కారణమయ్యే రుతుపవనాలు?
     ఎ) ఆగ్నేయ వ్యాపార పవనాలు
     బి) ఈశాన్య రుతుపవనాలు
     సి) నైరుతి రుతుపవనాలు    డి) వ్యాపార పవనాలు
 
 5.    {sేడ్ అనే జర్మనీ పదానికి అర్థం?
     ఎ) వేర్వేరు దిశల్లో ప్రయాణించే గాలులు
     బి) ‘ఎస్’ ఆకారంగా ప్రయాణించే గాలులు
     సి) ఒకే దిశలో స్థిరంగా ప్రయాణించే గాలులు
     డి) ‘ఎక్స్’ ఆకారంలో ప్రయాణించే గాలులు
 
 6.    పగలూ రాత్రీ ఉష్ణోగ్రతల్లో, వేసవి, చలికాలాల ఉష్ణోగ్రతల్లో తేడా ఉండే స్థితి?
     ఎ) సమ శీతోష్ణస్థితి
     బి) ఉష్ణ మండల శీతోష్ణస్థితి
     సి) ఆయన రేఖా శీతోష్ణస్థితి
     డి) భూమధ్య రేఖా శీతోష్ణస్థితి
 
 7.    అఎగి అంటే?
 Annual Global Warming
  Anthropogenic Global Warming
  Absolute Global Warming
  Abstract Global Warming

 8.    మే, జూన్ నెలల్లో వచ్చే తెలుగు రుతువు ?
     ఎ) వసంత రుతువు    బి) శరదృతువు
     సి) హేమంత రుతువు    డి) గ్రీష్మ రుతువు
 
 9.    మాఘ మాసాన్ని సూచించే ఇంగ్లిష్ నెల?
     ఎ) జనవరి        బి) ఆగస్టు
     సి) డిసెంబర్        డి) జూన్
 
 సమాధానాలు
 1) డి; 2) బి; 3) ఎ; 4) బి; 5) సి; 6) ఎ; 7) బి; 8) డి; 9) ఎ.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    రుతుపవనాలు అంటే ఏమిటి?
 జ:    ఒక నియమిత కాలంలో, ఆయా ప్రాంతాల్లో కాలాలను బట్టి, ఒక నిర్దిష్ట దిశల్లో వీచే పవనాలు రుతుపవనాలు. వీటిని ఆంగ్లంలో మాన్‌సూన్స్ అంటారు. ఇది మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది.
 
 2.    జెట్ ప్రవాహం అంటే ఏమిటి?
 జ:    భూమికి సమాంతరంగా వాతావరణంలోని ట్రోపో ఆవరణంలో, భూమి నుంచి 12వేల మీటర్ల ఎత్తులో అతివేగంగా వీచే గాలులు.
 
 3.    శీతోష్ణస్థితి అంటే ఏమిటి?
 జ:    భూ ఉపరితలంపైగల ఒక విశాల ప్రాంతం లో కొన్ని సంవత్సరాల (కనీసం 30 సంవత్సరాలు) పాటు నమోదైన వాతావరణ స్థితుల సగటు స్థితి.
 
 4.    వ్యాపార పవనాలు ఎక్కడ ఏర్పడతాయి?
 జ:    ఉత్తరార్ధ గోళంలో ఉప ఆయనరేఖ అధిక పీడనం వల్ల ఏర్పడే శాశ్వత పవనాలు భూమధ్యరేఖ వద్ద ఏర్పడిన అల్పపీడనం వైపు ప్రయాణిస్తాయి. వీటినే వ్యాపార పవనాలు (ఖీట్చఛ్ఛీ గిజీఛీట) అంటారు.
 
 2 మార్కులు
 1.    భూగోళం వేడెక్కటాన్ని ప్రభావితం చేసే మానవ కార్యకలాపాలేమిటి?
 2.    పీడన మండలాలు అనగా ఏమిటి?
 4 మార్కులు
 1.    భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాల్ని వివరించండి?
 2.    భారతదేశ పటంలో కిందివాటిని గుర్తించండి?
     ఎ) 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు
     బి) 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ సంవత్సర సగటు ఉష్ణోగ్రతను నమోదు చేసిన ప్రాంతాలు
     సి) భారతదేశంపై వీచే నైరుతి రుతుపవనాల దిశా మార్గం
 3.    భారతదేశంలోని కాలాలు, వాటి స్థితిగతులను వివరించండి?
 5. భారతదేశ నదులు-నీటి వనరులు
 
 1.    హిమాలయ నదులు అకస్మాత్తుగా దక్షిణానికి మలుపు తిరిగి ఉత్తర భారత మైదానాలను చేరుకునే క్రమంలో ఏ ఆకారంలో లోయలను ఏర్పరిచాయి?
     ఎ) ఖీ    బి) గ    సి) ్ఠ    డి) గి
 
 2.    సింధు నది కైలాస పర్వతాల్లోని చిచిచిచి వద్ద జన్మిస్తుంది?
     ఎ) మానస సరోవరం, టిబెట్    బి) గంగోత్రి
     సి) యమునోత్రి    డి) హిమాద్రి
 
 3.    సింధు నదికి ప్రధాన ఉపనదులు?
     ఎ) జీలం, చీనాబ్, రావి,
     బి) జీలం, చీనాబ్, రావి,బియాస్, సట్లెజ్
     సి) జీలం, చీనాబ్
     డి) జీలం, చీనాబ్, రావి, బియాస్
 
 4.    సింధు నది మన దేశంలో జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చిచిచిచి  రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది?
     ఎ) ఢిల్లీ        బి) హర్యానా
     సి) పంజాబ్        డి) గుజరాత్
 
 5.    గంగా నది ఏయే నదుల కలయికతో ఏర్పడింది?
     ఎ) భగీరథి, బ్రహ్మపుత్ర
     బి) బ్రహ్మపుత్ర, అలక్‌నంద
     సి) అలక్‌నంద, చీనాబ్    డి) భగీరథి, అలక్‌నంద
 
 6.    భగీరథి, అలక్‌నంద ఎక్కడ కలిసి గంగానదిగా మారుతుంది?
     ఎ) మానస సరోవరం    బి) పాట్నా
     సి) దేవ ప్రయాగ    డి) లక్నో
 
 7.    {బహ్మపుత్ర ఏ హిమానీ నదం నుంచి జన్మించింది?
     ఎ) చెమయుంగ్ డంగ్    బి) హిమాద్రి
     సి) శివాలిక్        డి) పైవేవీకావు
 
 8.    {బహ్మపుత్ర నదిని టిబెట్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
     ఎ) పద్మ        బి) సాంగ్‌పో
     సి) దిహాంగ్        డి) బ్రహ్మపుత్రి
 
 9.    అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిని ఏ పేరుతో పిలుస్తారు?
     ఎ) సియాంగ్ / దిహాంగ్    బి) సాంగ్‌పో
     సి) పద్మ        డి) మేఘన
 
 సమాధానాలు
 1) బి; 2) ఎ; 3) బి; 4) సి; 5) డి; 6) సి; 7) ఎ;
 8) బి; 9) ఎ.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    పరీవాహక ప్రాంతం అంటే ఏమిటి?
 జ:    ఏదైనా నీటి ప్రవాహానికి (నది, చెరువు, సరస్సు, వాగు) నీటిని అందించే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం.
 పరీవాహక ప్రాంతంలో ఎంత ఎక్కువ వర్షపాతం ఉంటే ఆ నీటి ప్రవాహానికి అంత ఎక్కువ నీరు చేరుతుంది.
 
 2.    కరవును నిర్వచించండి?
 జ:    ఒక ప్రాంతంలో వార్షిక వర్షపాతం సగటు కంటే తక్కువ కురిస్తే దాన్ని కరవు అంటారు. కరవు సంభవిస్తే పంటలు పండవు. ధరలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది.
 
 3.    {పవహించే వనరులను తెలపండి?
 జ:    {పవహించే వనరుల్లో నీటి వనరులు ముఖ్యమైనవి. ఉపరితల జల ప్రవాహాలు, భూగర్భ జల ప్రవాహాలు అని రెండు రకాల నీటి వనరులున్నాయి. నదులు, కాలువలు, వాగులు, చెరువులు ఉపరితల నీటి ప్రవాహాలకు ఉదాహరణలు. భూగర్భంలో ఉండే నీటి వనరులు కూడా నేలవాలును బట్టి అంతర్గతంగా ప్రవహిస్తాయి.
 
 2 మార్కులు
 1.    మీ ప్రాంతంలో ఉన్న నీటి వనరులను, వాటి పరీవాహక ప్రాంత విస్తీర్ణాన్ని తెలపండి?
 4 మార్కులు
 1.    భారతదేశంలోని ప్రధాన నదీ వ్యవస్థలను వివరించ డానికి కింది అంశాల ఆధారంగా ఒక పట్టిక తయారు చేయండి?
     ఎ) నది ప్రవహించే దిశ
     బి) అవి ఏ రాష్ట్రాలు లేదా దేశాల గుండా ప్రవహిస్తు న్నాయి.
     సి) ఆ ప్రాంతం భౌగోళిక పరిస్థితులు
 
 2.    నీటి సంరక్షణను మెరుగుపరచడానికి హివ్రే బజార్ వాసులు తమ వ్యవసాయంలో ఏ పద్ధతులపై నియం త్రణ విధించారు? (విషయావగాహన)
 3.    భారతదేశ పటంలో కింది నదుల ప్రవాహ మార్గాలను గీయండి?
     ఎ) కృష్ణా    బి) కావేరి    సి) సింధు    డి)బ్రహ్మపుత్ర
 4.    ‘భూగర్భ జలాలు అందరికీ చెందిన వనరులు’ - మీ అభిప్రాయాన్ని వివరించండి?
 
 6. ప్రజలు
 
 1.    మన దేశంలో మొదటి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది?
     ఎ) 1902    బి) 1872    సి) 1852    డి) 1782
 
 2.    ఏ వయసుగల వ్యక్తులను శ్రామిక జనాభా అంటారు?
     ఎ) 15-59 సంవత్సరాలు
     బి) 19-60 సంవత్సరాలు
     సి) 20-60 సంవత్సరాలు
     డి) 16-59 సంవత్సరాలు
 
 3.    స్త్రీల అక్షరాస్యతలో ముందంజలో ఉన్న రాష్ట్రం?
     ఎ) హర్యానా        బి) పంజాబ్
     సి) తమిళనాడు    డి) కేరళ
 
 4.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫెర్టిలిటీ శాతం?
     ఎ) 1.9    బి) 2.4     సి) 1.65    డి) 2.78
 
 5.    అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం?
     ఎ) బీహార్         బి) ఉత్తరప్రదేశ్
     సి) తెలంగాణ    డి) మధ్య ప్రదేశ్
 
 6.    అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం?
     ఎ) అరుణాచల్ ప్రదేశ్    బి) మణిపూర్
     సి) అసోం        డి) నాగాలాండ్
 
 7.    తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత శాతం?
     ఎ) 66.46    బి) 66.99    సి) 59.89    డి) 61.24
 
 సమాధానాలు
 1) బి; 2) ఎ; 3) డి; 4) ఎ; 5) ఎ; 6) ఎ;
 7) ఎ.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    జనసాంద్రత అంటే ఏమిటి?
 జ:    ఒక చదరపు కిలోమీటరు భూభాగంలో నివసించే జనాభానే జనసాంద్రత అంటారు.
 
 2.    ఫెర్టిలిటీ శాతం అంటే ఏమిటి?
 జ:    ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి, ప్రస్తుత పరిస్థితి ఆధారంగా పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను ఫెర్టిలిటీ శాతం అంటారు.
 
 2 మార్కులు
 1. అభివృద్ధిని అక్షరాస్యత ఎలా ప్రభావితం చేస్తుంది?
 4 మార్కులు
 1.    లింగ నిష్పత్తి చాలా ఎక్కువగా, చాలా తక్కువగా ఉంటే సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించండి?
 2.    భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనాభా వేగంగా పెరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు?
 3.    జనాభా పెరుగుదలకు గల కారణాల్ని విశ్లేషించి, జనాభాను అరికట్టే పరిష్కార మార్గాల్ని సూచించండి?
 4.    మీ జిల్లా జనాభా స్థితిగతులపై ఒక వ్యాసం రాయండి?
 5.    భారతదేశ పటంలో అత్యధిక జనాభా గల నాలుగు నగరాలను గుర్తించండి?
 7. ప్రజలు-నివాస ప్రాంతాలు
 
 1.    దేశంలో రెండో అతిపెద్ద నగరం
     ఎ) ముంబై    బి) ఢిల్లీ    సి) కోల్‌కత    డి) చెన్నై
 
 2.    మన దేశంలోని పట్టణ జనాభా కోట్లల్లో?
     ఎ) 37     బి) 38     సి) 39     డి) 40
 
 3.    పట్టణీకరణ అంటే?
     ఎ) నగర జనాభా పెరగడం
     బి) పట్టణ వలసలు పెరగడం
     సి) పట్టణాల సంఖ్య పెరగడం
     డి) పట్టణ విస్తీర్ణం పెరగడం
 
 4.    రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
     ఎ) ముంబై        బి) విశాఖపట్టణం
     సి) చెన్నై        డి)హైదరాబాద్
 
 5.    చత్రపతి శివాజీ ప్రతాప్‌గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది?
     ఎ) మధ్యప్రదేశ్    బి) మహారాష్ట్ర
     సి) రాజస్థాన్     డి) గుజరాత్
 
 6.    విమానాశ్రయాల చుట్టూ ఏర్పడే నగరాలను ఏమంటారు?
     ఎ) ఏరో జోన్ సిటీస్    బి) ఏరోట్రో పోలిస్
     సి) ఏరో అర్బన్ ఏరియా    డి) ఏరోటిక్ ఏరియా
 
 సమాధానాలు
 1) బి; 2) ఎ; 3) సి; 4) డి; 5) బి; 6) బి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    తరతమ స్థాయి అని దేన్ని అంటారు?
 జ:    కనీస సౌకర్యాల కల్పనలో రెండు ప్రాంతాల మధ్యగల వ్యత్యాసాన్ని తరతమ స్థాయి అంటారు.
 
 2.    మెట్రో పాలిటన్ నగరం అంటే ఏమిటి?
 జ:    అత్యధిక పట్టణ జనసాంద్రత కలిగి, ఆధునికంగా,  పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, అనేక ప్రజా సముదాయాలు గల నగరం. జనాభా 10 లక్షల కంటే ఎక్కువగా ఉంటుంది.
 
 2 మార్కులు
 1.    విమానాశ్రయ నగర కేంద్రంలో ఉండే సదుపాయాల్ని తెలపండి?
 2.    మీ ప్రాంతంలో ఎలాంటి వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి?
 4 మార్కులు
 1.    ఇచ్చిన పట్టిక ఆధారంగా 1901-2011ల మధ్య విశాఖపట్టణం జనాభాకి లైన్‌గ్రాఫ్ తయారు చేయండి? జనాభాలో మీరు ఎలాంటి మార్పులు గమనించారు?
 2.    మీరు నివసించే ప్రాంతాన్ని గత పదేళ్ల నుంచి ఏయే కారకాలు ప్రభావితం చేశాయో కనుక్కోండి?
 3.     పట్టణ ప్రాంత సదుపాయాల మధ్య పోలికలు, భేదాలు తెలపండి?
 
 8. ప్రజలు - వలసలు
 
 1.    స్త్రీలు వలసపోవడానికి ప్రధాన కారణం?
     ఎ) నిరుద్యోగం    బి) అక్షరాస్యత
     సి) వివాహం     డి) పేదరికం
 
 2.    2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంత మంది వలస వెళ్లారు?
     ఎ) 30.7 కోట్లు    బి) 35 కోట్లు
     సి) 32.6 కోట్లు     డి) 33.7 కోట్లు
 
 3.    ‘ఇంతకు ముందున్న నివాస స్థలం’ అంటే?
     ఎ) ఒక వ్యక్తి ఇంతకుముందు నివశించిన ప్రదేశం
     బి) ఒక వ్యక్తి ఆరునెలలు లేదా అంతకుమించి ఎక్కువకాలం నివశించిన ప్రదేశం
     సి) ఒక వ్యక్తి ఆరు నెలల్లోపు నివశించిన ప్రదేశం
     డి) ఒక వ్యక్తి ఏడాదిపాటు నివశించిన ప్రదేశం
 
 4.    చక్కెరను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
     ఎ) మహారాష్ట్ర    బి) ఉత్తరప్రదేశ్
     సి) తమిళనాడు    డి) పంజాబ్
 
 5.    భారతీయులు విదేశాలకు వలసవెళ్లి పనిచేయడానికి పర్యవేక్షించే చట్టం?
     ఎ) 1984 వలసల చట్టం    బి) 1990 వలసల చట్టం
     సి) 1983 వలసల చట్టం    డి) 1985 వలసల చట్టం
 
 6.    మనదేశంలో ఏ రాష్ట్రం నుంచి ఇతరదేశాలకు వలసలు ఎక్కువగా ఉన్నాయి?
     ఎ) ఆంధ్రప్రదేశ్    బి) తెలంగాణ
     సి) పంజాబ్        డి) తమిళనాడు
 
 సమాధానాలు
 1) సి; 2) ఎ; 3) బి; 4) బి; 5) సి; 6) సి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    వలసను నిర్వచించండి?
 జ:    {పజలు కనీస జీవనానికి అవసరమైన సదుపాయాలు తమ ప్రాంతంలో లేనపుడు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలివెళ్లడాన్ని వలస అంటారు.
 2.    విదేశాలకు వలసను నిర్వచించండి?
 జ:    ఉపాధి, విద్య, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్లడాన్ని విదేశాలకు వలస అంటారు.
 2 మార్కులు
 1.    పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లభించడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
 2.    మీ ప్రాంతం నుంచి ఎక్కువగా ఏయే ప్రాంతాలకు ప్రజలు వలస పోతున్నారు? ఎందుకు వలస వెళ్తున్నారో పట్టిక రూపంలో వివరించండి?
 3.    వలసలను ఆపాలంటే ప్రభుత్వం ఏం చేయాలి?
 4 మార్కులు
 1.     ప్రాంతాల నుంచి పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామాలకు వలసల మధ్య పోలికలు, భేదాలు రాయండి?
 2.    మీకిచ్చిన ప్రపంచ పటంలో మన దేశం నుంచి వలసలు ఏయే దేశాలకు ఎక్కువగా వెళుతున్నారు? అలాం టి నాలుగు దేశాలను బాణం గుర్తుతో గుర్తించండి?
 
 9. రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ
 
 1.    రాంపురంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం?
     ఎ) కుటీర పరిశ్రమలు    బి) చిల్లర వ్యాపారం
     సి) వ్యవసాయం    డి) కులవృత్తి
 
 2.    వర్షాకాలంలో చేపట్టే సాగును ఏమని పిలుస్తారు?
     ఎ) ఖరీఫ్        బి) రబీ
     సి) జయాద్        డి) మాన్‌సూన్
 3.    2009-10లో మనదేశంలో ప్రతి 100 మంది గ్రామీణ కార్మికుల్లో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు?
     ఎ) 32    బి) 40    సి) 36    డి) 38
 
 4.    గోధుమ ఎక్కువగా పండే కాలం?
     ఎ) ఖరీఫ్    బి) రబీ సి) జయాద్    డి) ఖరీఫ్, రబీ
 5.    ఒక హెక్టార్ అంటే ?
     ఎ) 10 వేల చదరపు మీటర్లు
     బి) 20 వేల చదరపు మీటర్లు
     సి) 30 వేల చదరపు మీటర్లు
     డి) 40 వేల చదరపు మీటర్లు
 
 6.    ఒకే విస్తీర్ణంలో ఒక ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ పంటల్ని సాగు చేయడాన్ని ఏమంటారు?
     ఎ) అంతర పంటల సాగు    బి) బహుళ పంటల సాగు
     సి) ఏక వార్షిక సాగు    డి) బహు వార్షిక సాగు
 
 సమాధానాలు
 1) సి; 2) ఎ; 3) ఎ; 4) బి; 5) ఎ; 6) బి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటి?
 జ:    ఉత్పత్తి కారకాలు: ఉత్పత్తికి ఉపయోగపడే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి కారకాలు అంటారు. ఉదా: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు, సాంకేతిక పరిజ్ఞానం.
 2.    స్థిర పెట్టుబడిని నిర్వచించండి?
 జ:    స్థిర పెట్టుబడి: స్థిరంగా ఉండే వస్తువులపై పెట్టే పెట్టుబడిని స్థిర పెట్టుబడి అంటారు. ఉదాహరణ: యం త్రాలు, విడిపరికరాలు, భవనాలపై పెట్టిన పెట్టుబడి.
 3.    మిగులు పంటగా దేన్ని భావిస్తారు?
 జ:    మిగులు పంట: రైతు తాను పండించిన పంటను తన అవసరాలకు సరిపడా ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన పంట. దీన్ని అమ్మి సొమ్ము చేసుకొని తిరిగి వ్యవసాయానికి మూలధనం సంపాదిస్తాడు.
 2 మార్కులు
 1.    మీ ప్రాంతంలో వస్తువుల సేవల ఉత్పత్తిలో ఏయే రకంగా శ్రమను పొందుతారు?
 2.    భారతదేశంలో పలు ప్రాంతాల రైతులు సాగు చేసే భూవిస్తీర్ణం ఎంతో తెలపండి?
 4 మార్కులు
 1.    మీ ప్రాంతంలోని ప్రధాన వ్యవసాయేతర పనులు ఏమిటి? ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని దాని గురించి నివేదికను రూపొందించండి?
 2.    మీ ప్రాంతంలో స్త్రీలకు, పురుషులకు ఉన్న రోజువారీ కూలీరేట్లు ఏమిటి? వాటి మధ్య వ్యత్యాసముంటే కారణాలేంటో తెల్పండి? వీటిపై మీ సొంత అభిప్రాయాలు రాయండి?
 
 10. ప్రపంచీకరణ
 
 1.    ఫోర్డ్ మోటార్స్ అనేది ఏ దేశ కంపెనీ?
     ఎ) జర్మనీ        బి) ఇంగ్లండ్
     సి) అమెరికా        డి) ఫ్రాన్స్
 
 2.    కూఇ అంటే?
     ఎ) విదేశీ పెట్టుబడిదారి సంస్థలు
     బి) బహుళ జాతి సంస్థలు
     సి) విదేశీ పరిశ్రమల సముదాయం
     డి) స్వదేశీ సంస్థల సముదాయం
 
 3.    రాన్‌బాక్సీ అనే కంపెనీ ఉత్పత్తి చేసేది?
     ఎ) కార్లు        బి) కంప్యూటర్లు
     సి) దుస్తులు        డి) మందులు
 
 4.    ఆర్థిక పునర్నిర్మాణం, అభివృద్ధికి ఏర్పడిన అంతర్జాతీయ బ్యాంకు?
     ఎ) గిఖీై        బి) ఐఈఆఐ
     సి) ఐఆఖఈ        డి) ూ్ఖై
 
 5.    గిఖీై అంటే?
     ఎ) వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్
     బి) వర ల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
     సి) ప్రపంచ టెలికమ్ సంస్థ    డి) పైవేవీ కావు
 
 6.    {పపంచ వ్యాప్తంగా వాణిజ్యాన్ని, ప్రతిభను, ఆలోచ నల్ని, భావాల్ని అందరూ పంచుకొని విస్తరించడాన్ని ఏమంటారు?
     ఎ) పరస్పర సహకారం
     బి) పరస్పర జ్ఞాన మార్పిడి
     సి) ప్రపంచీకరణ    డి) పైవన్నీ
 
 సమాధానాలు
 1) సి; 2) బి; 3) డి; 4) సి; 5) బి; 6) సి.
 
 ముఖ్య ప్రశ్నలు ఒకమార్కు
 1.    బహుళ జాతి సంస్థలు అని వేటిని అంటారు?
 జ:    ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తుల్ని నియంత్రించే సంస్థలను బహుళ జాతి సంస్థలు అంటారు.
 2.    జాతీయ రాజ్యాన్ని నిర్వచించండి?
 జ:    స్థిరమైన భౌగోళిక సరిహద్దులు, ప్రభుత్వం, ప్రదేశం గల దేశం.
 3.    సరళీకృత ఆర్థిక విధానాన్ని వివరించండి?
 జ:    విదేశీ వాణిజ్యాన్ని పెంచడంలో భాగంగా ఎగుమతి, దిగుమతులపై ఒక దేశం చాలా తక్కువ పరిమితుల్ని విధించడాన్ని సరళీకృత ఆర్థిక విధానం అంటారు.
 2 మార్కులు
 1.    విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి?
 
 4 మార్కులు
 1.    ‘ప్రపంచీకరణ ప్రభావం ఒకే రకంగా లేదు’ ఈ వాక్యాన్ని వివరించండి?
 2.    {పపంచీకరణ వల్ల భారతదేశానికి లాభమా?నష్టమా? వివరంగా తెలపండి?
 
 11. ఆహార భద్రత
  1.    జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూతనంగా ఏ సంవత్సరంలో రూపొందించారు?
     ఎ) 2012    బి) 2013    సి) 2014    డి) 2011
 
 2.    దేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు ఎంత మోతాదు లో కూరగాయలు తీసుకోవాలి? (గ్రాముల్లో)
     ఎ) 100    బి) 200    సి) 300    డి) 400
 
 3.    జాతీయ పోషకాహార సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) ఏ నగరంలో ఉంది?
     ఎ) బెంగళూరు    బి) ఢిల్లీ
     సి) చె న్నై        డి) హైదరాబాద్
 
 4.    వరి ఉత్పత్తి 1970-71 నాటికి 40 మిలియన్ టన్నుల నుంచి 2010-11 నాటికి ఎన్ని మిలియన్ టన్నులకు పెరిగింది?
     ఎ) 100    బి) 95    సి) 60    డి) 80
 
 5.    ఏయే పంటల దిగుబడి వరి, గోధుమలతో పోలిస్తే ఎప్పుడూ తక్కువగా ఉంది?
     ఎ) జొన్న, నూనె గింజలు    బి) మొక్కజొన్న, జొన్న
      సి) మొక్కజొన్న, నూనె గింజలు
     డి) జొన్న, వేరుశనగ
 
 6.    {పతి వ్యక్తి సంవత్సరంలో సగటున ఎన్ని గుడ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?
     ఎ) 100    బి) 125    సి) 150    డి) 180
 
 సమాధానాలు
 1) బి; 2) సి; 3) డి; 4) బి; 5) ఎ; 6) డి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    బఫర్ నిల్వలు అనే వేటిని అంటారు?
 జ:    భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా కొని, నిల్వచేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలుగా పేర్కొంటారు.
 2.    మద్దతు ధర అంటే ఏమిటి?
 జ:    అదనపు ఆహారధాన్యాల ఉత్పత్తి ఉన్న రాష్ట్రాల నుంచి భారత ప్రభుత్వం భారత ఆహార సంస్థతో కొనుగోలు చేస్తుంది. ఈ ఉత్పత్తులకు అంతకుముందే ప్రకటించిన ధరల్ని రైతులకు చెల్లిస్తారు. ఈ ధరల్నే మద్దతుధరలు అంటారు.
 3.    {పజా పంపిణీ వ్యవస్థను నిర్వచించండి?
 జ:    పేద ప్రజలకు ప్రభుత్వం నడిపే చౌక ధరల దుకాణాల ద్వారా తక్కువ ధరకు ఆహారధాన్యాల్ని అమ్మే వ్యవస్థ.
 
 2 మార్కులు
 1.    {పకృతి వైపరీత్యాల వల్ల ఒక ఏడాది పాటు ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అనుకుంటే...ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత పెరగడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి?
 2.    మీ ఊరిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లల సంఖ్య, వారికందించే ఆహారధాన్యాల వివరాల్ని సంక్షిప్తంగా తెలపండి?
 4 మార్కులు
 1.    ఆహార ఉత్పత్తి పెరగడానికి, ఆహార భద్రతకు మధ్య గల సంబంధాన్ని వివరించండి?
 2.    {పభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ వల్ల పేదలకు కావా ల్సిన ఆహారధాన్యాల్ని సక్రమంగా అందజేస్తున్నారు. ఈ వ్యాఖ్యకు మద్దతుగా నివేదిక రాయండి?
 
 12. సమానత సుస్థిర అభివృద్ధి
 
 1.    ధారవి మురికివాడ ఏ నగరంలో ఉంది?
     ఎ) కోల్‌కత        బి) న్యూఢిల్లీ
     సి) ముంబై        డి) బెంగళూరు
 
 2.    రాచెల్ కార్సన్ రాసిన ‘సెలైంట్ స్ప్రింగ్ (నిశ్శబ్ద వసంతం)’ పుస్తకం దేని గురించి వివరిస్తుంది?
     ఎ) పురుగు మందుల వల్ల మనుషులకు జరిగే నష్టాలపై
     బి) ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడుల గురించి
     సి) ఈఈఖీ పిచికారితో మనుషులు, పక్షులపై పడే ప్రభావం గురించి
      డి) మోనోక్రోటోఫాస్ చల్లడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు విషపూరితం కావడం గురించి
 
 3.    మానవ నిర్మిత ఆనకట్టల్లో అతి పెద్దది?
     ఎ) సర్దార్ సరోవర్ డ్యామ్
     బి) నాగార్జునసాగర్
     సి)  భాక్రానంగల్ డ్యామ్
     డి) హిరాకుడ్ డ్యామ్
 
 4.    చిప్కో అంటే?
     ఎ) చెట్ల నరికివేత ఆపడం    బి) హత్తుకోవడం
     సి) ప్రమాదం        డి) చెట్లను నరకడం
 
 5.    రసాయనిక ఎరువులు, పురుగు మందులను నిషేధించిన రాష్ర్టం ?
     ఎ) కేరళ        బి) గుజరాత్
     సి) పంజాబ్        డి) సిక్కిం
 
 6.    నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు?
     ఎ) మేధాపట్కర్    బి) అన్నాహజారే
     సి) బహుగుణ    డి) ఎవరుకాదు
 
 7.    జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి ఏ రాష్ర్ట ప్రభుత్వం ఆ తోటలపై హెలికాప్టర్ల ద్వారా పురుగు మందులను చల్లింది?
     ఎ) కేరళ        బి) గుజరాత్
     సి) పంజాబ్        డి) సిక్కిం
 
 సమాధానాలు
 1) సి; 2) సి; 3) ఎ; 4) బి; 5) డి; 6) ఎ;
 7) ఎ.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    పర్యావరణం అంటే ఏమిటి?
 జ.    మానవాళి ఉనికి, అభివృద్ధి, పరిసరాలను ప్రభావితం చేసే అంశాలను పర్యావరణం అంటారు.
 2.    సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి?
 జ:    {పస్తుత అభివృద్ధి వల్ల భవిష్యత్ తరాల అభివృద్ధికి ఆటంకం కలగకుండా, అభివృద్ధి వెనకడుగు వేయకుండా స్థిరంగా ఉండడం.
 3.    వనరుల మూలం అని దేన్ని అంటారు?
 జ:    సహజ వనరులు లభించే ప్రాంతం లేదా ఆ వనరులు ఉత్పన్నమవ్వడానికి కారణమైన పదార్థం.
 
 2 మార్కులు
 1.    నీటిని ఉమ్మడి ఆస్తిగా ఎందుకు పరిగణించాలి?
 2.    హరిత విప్లవం విస్తరించడం వల్ల ఎటువంటి పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి?
 3.    చిప్కో ఉద్యమం గురించి తెలపండి?
 4 మార్కులు
 1.    మన జీవన శైలి పర్యావరణాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలపండి?
 2.    సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రభుత్వం ఏవిధంగా కృషి చేయాలని మీరనుకుంటున్నారు?
 పేపర్ - ఐఐ
 
 13. ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం (భాగం-ఐ)
 1.    20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా అభివర్ణించింది?
     ఎ) అబ్రహం లింకన్    బి) ఎరిక్ హాబ్స్ బామ్
     సి) థామస్ హబ్స్    డి) ఎడ్వర్‌‌డ ఎరిక్‌సన్
 
 2.    {పపంచ వ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
     ఎ) 1929    బి) 1930    సి) 1936    డి) 1939
 
 3.    నాజీయిజం ఏ దేశంలో ఆవిర్భవించింది?
     ఎ) ఇటలీ        బి) అమెరికా
     సి) ఫ్రాన్‌‌స        డి) జర్మనీ
 
 4.    నానాజాతి సమితికి రూపకల్పన చేసింది?
     ఎ) నెహ్రూ        బి) ఉడ్రో విల్సన్
     సి) రూజ్‌వెల్ట్        డి) మార్షల్
 
 5.    నాగసాకి, హిరోషిమాలపై అణు బాంబు వేసిన దేశం?
     ఎ) జపాన్        బి) ఇంగ్లండ్
     సి) అమెరికా        డి) రష్యా
 
 6.    రష్యా విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది?
     ఎ) 1917    బి) 1918    సి) 1907    డి) 1919
 
 7.    వర్సయిల్స్ సంధి షరతుల ప్రకారం ఏ దేశం తీవ్ర అవమానానికి గురైంది?
     ఎ) జపాన్        బి) ఇంగ్లండ్
     సి) జర్మనీ        డి) రష్యా
 
 8.    ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
     ఎ) అక్టోబర్ 23    బి) అక్టోబర్ 24
     సి) అక్టోబర్ 22    డి) అక్టోబర్ 25
 
 సమాధానాలు
 1) బి; 2) ఎ; 3) డి; 4) బి; 5) సి; 6) ఎ; 7) సి;
 8) బి.
 
 ముఖ్య ప్రశ్నలు  ఒకమార్కు
 1.    దురహంకార పూరిత జాతీయవాదం అంటే ఏమిటి?
 జ:    దురహంకార పూరిత జాతీయవాదం: తీవ్రమైన జాతీయ భావనకు గురైన ప్రజలు తమ జాతి అన్నిటి కంటే గొప్పది అని భావిస్తూ, తమ జాతి గొప్పదనం వ్యాప్తి కోసం కృషిచేస్తూ ఇతర జాతి ప్రజల పట్ల ద్వేష భావాన్నికలిగి ఉండటాన్ని దురహంకార పూరిత జాతీయ వాదం అంటారు.
 
 2.    సైనిక వాదాన్ని నిర్వచించండి?
 జ:    తమ దేశ భద్రతకు దృఢమైన సైనిక శక్తి అత్యవసరమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని ప్రజలు లేదా ప్రభుత్వం నమ్మడాన్ని సైనిక వాదం అంటారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement