పేదలకు న్యాయం చేయాలి | ysrcp demand | Sakshi
Sakshi News home page

పేదలకు న్యాయం చేయాలి

Dec 16 2016 11:37 PM | Updated on Sep 3 2019 8:56 PM

ఆదెమ్మ దిబ్బ స్థలంలో 50 ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లులేని పేదలకు ఇల్లు కట్టించి ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఆదెమ్మ దిబ్బ స్థలంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరింది. శుక్రవారం

  • ఆదెమ్మదిబ్బ స్థలంపై విచారణ జరపాలి
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌
  • వారసులు లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
  • ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి 
  • సాక్షి, రాజమహేంద్రవరం :
    ఆదెమ్మ దిబ్బ స్థలంలో 50 ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లులేని పేదలకు ఇల్లు కట్టించి ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  డిమాండ్‌ చేసింది. ఆదెమ్మ దిబ్బ స్థలంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరింది. శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ బృందం ఆదెమ్మ దిబ్బ స్థలాన్ని పరిశీలించింది. పేదలను కలిసి వివరాలు అడిగి తెలుసుకుంది. అక్కడ ఆ స్థలం కొనుగోలు చేశామని చెబుతున్న పిన్నమరెడ్డి ఈశ్వరుడితో షర్మిలారెడ్డి మాట్లాడారు. తాను ఈ స్థలం కొనుగోలు చేశానని, అందుకే వీరందరినీ ఖాళీ చేయిస్తున్నాని ఈశ్వరుడు తెలిపారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపాలని షర్మిలా రెడ్డి కోరగా ప్రస్తుతం తన వద్ద లేవని, సాయంత్రం ఐదు గంటలకు తెచ్చి చూపిస్తానని తప్పించుకునే ప్రయత్నం చేశారు. స్థలం మీరు కొనుగోలు చేస్తే ఫర్వాలేదని, అలా కాకుండా పేదలకు అన్యాయం చేస్తుంటే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. ç వైస్సార్‌సీపీ బృందంలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దంగేటి వీరబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు మాసా రామజోగి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి లంక సత్యనారాయణ, నగర ట్రేడ్‌ యూనియ¯ŒS అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ, పార్టీ నేతలు ఆరీఫ్, కోడికోట, అభి తదితరులు ఉన్నారు. 
    స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
    స్థలం కోనుగోలు చేశానని చెబుతున్న పిన్నమరెడ్డి ఈశ్వరుడు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించలేదని షర్మిలారెడ్డి తెలిపారు. ఆదెమ్మ దిబ్బ స్థలం టౌ¯ŒS సర్వే నంబర్‌ పరిధిలోకి వస్తుందని, నగరపాలక సంస్థ అధికారులు సమగ్ర విచారణ జరిపి స్థలం ఎవరిదో తెల్చాలని డిమాండ్‌ చేశారు.  నగరంలో ప్రభుత్వ భూమిలేక పట్టణ పేదలకు కట్టించాల్సిన ఇళ్లు రూరల్‌ నియోజకవర్గంలో కట్టాల్సి వస్తోందన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement