వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం | YS Jagan mohan reddy visit kamalapuram | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం

Feb 25 2016 8:41 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం - Sakshi

వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ప్రారంభం

వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన గురువారం ప్రారంభమైంది.

కడప : వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన గురువారం ప్రారంభమైంది. ఉదయం 7.30 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో కమలాపురం వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్ కొద్దిసేపు ఆగి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఎర్రగుంట్ల మునిసిపాలిటీకి చెందిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ దాసరి సూర్యానారాయణరెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

మునిసిపల్ అధికారులు ప్రతిపక్ష పార్టీకి చెందిన సూర్యానారాయణరెడ్డిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుండడంతో పార్టీ తరఫున భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ ప్రొద్దటూరుకు బయల్దేరి వెళ్లారు. సదరు ప్రాంతాల్లోని పలు కుటుంబాలను వైఎస్ జగన్ ఈ రోజు పరామర్శించనున్నారు. అలాగే ఈ రోజు రాత్రి జరగబోయే చిన్నమ్మ కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement