మెదక్ జిల్లా లో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు వాహనాల రాకపోకలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు.
తూప్రాన్ : మెదక్ జిల్లా లో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు వాహనాల రాకపోకలను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు. జిల్లాలోని తూప్రాన్ మండలం వెంకటాపురం అగ్రహారం గ్రామస్థులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెల్లినా పట్టించుకోలేదు. సర్పంచ్ కూడా అధికారుల దృష్టికి తీసుకునిపోకపోవడంతో అతని దిష్టి బొమ్మను దహనం చేశారు. రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి.