మధ్యమధ్యలో చిన్నచిన్న ఒడుదొడుకులు ఎదురైనా మొత్తమ్మీద గోదావరి డెల్టాలో రబీ సాగు గట్టెక్కింది. సీలేరుకుతోడు.. సహజ జలాలు ఆశాజనకంగా ఉండడంతో రబీ సాఫీగానే సాగింది. డిసెంబర్ ఒకటి నుంచి.. కాలువలు మూత పడిన ఈ నెల 15వ తేదీ వరకూ..
-
-
గోదావరి సహజ జలాలతోనే రబీసాగు
-
ముగిసిన సీజ¯ŒS.. మూతపడిన కాలువలు
మధ్యమధ్యలో చిన్నచిన్న ఒడుదొడుకులు ఎదురైనా మొత్తమ్మీద గోదావరి డెల్టాలో రబీ సాగు గట్టెక్కింది. సీలేరుకుతోడు.. సహజ జలాలు ఆశాజనకంగా ఉండడంతో రబీ సాఫీగానే సాగింది. డిసెంబర్ ఒకటి నుంచి.. కాలువలు మూత పడిన ఈ నెల 15వ తేదీ వరకూ.. సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం మొత్తం సుమారు 104 టీఎంసీల గోదావరి జలాలు వినియోగించారు.
అమలాపురం :
డిసెంబర్ ఒకటిన ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాల్లో రబీ షెడ్యూల్ ఆరంభమైం ది. అధికారుల లెక్కల ప్రకారం డెల్టాల్లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 8.86 లక్షల ఎకరాలు కాగా, వాస్తవ సాగు 7.50 లక్షల ఎకరాలు మాత్రమే. డెల్టాల్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం 90 టీఎంసీల జలాలు కావాలన్నది అధికారుల లెక్క. ఇందులో 75 నుంచి 80 టీఎంసీలు వస్తే చాలు రబీ గట్టెక్కుతోంది. అటువంటిది ఈసారి ఏకంగా 104 టీఎంసీ నీటిని కాలువలకు వదిలారు. గోదావరిలో ఇ¯ŒSఫ్లో ఆశాజనకంగా ఉన్నందున, రబీకి నీటి ఎద్దడి రాదని విశ్లేషిస్తూ ‘గోదావరి డెల్టాలో రబీకి ఢోకా లేనట్టే’ అన్న శీర్షికతో గత అక్టోబరు 16న ‘సాక్షి’ కథనం కూడా ఇచ్చింది. మధ్యలో కొంత ఎద్దడి ఛాయలు కనిపించినా.. మొత్తమ్మీద సాగునీటికి పెద్దగా ఇబ్బందులు లేకుండానే డెల్టాలో రబీసాగు సాఫీగానే ముగిసింది.
తొమ్మిదేళ్లలో ఇది రెండోసారి
2009 నుంచి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి తప్పడం లేదు. 2010–11లోను, ప్రస్తుత రబీలోను నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదు. మిగిలిన అన్ని రబీ సీజన్లలో నీటి ఎద్దడి తప్పలేదు. 2009–10, 2011–12, 2014–15, 2015–16 సంవత్సరాల్లో రబీకి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. 2001–12లోనైతే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏకంగా 1.50 లక్షల ఎకరాల్లో రబీ సాగు నిలిచిపోయింది. గత ఏడాది రబీకి ఏకంగా 23 టీఎంసీల నీటి కొరత ఏర్పడినా మొత్తం ఆయకట్టుకు అనుమతి ఇచ్చారు. సకాలంలో సాగునీరు అందించకపోవడంతో రెండు డెల్టాల్లో ఏకంగా 50 వేల ఎకరాల్లో దిగుబడిపై ప్రభావం పడి, రైతులు నష్టపోయారు.
అంచనాలకు మించి సహజ జలాల రాక
అంచనాలకు మించి సహజ జలాలు రావడం ఈసారి రబీ రైతులకు వరంగా మారింది. సాధారణంగా రబీ సీజ¯ŒSలో సహజ జలాలకన్నా సీలేరు పవర్ జనరేష¯ŒS నుంచి వచ్చే నీరే ఎక్కువ. రబీలో సీలేరు నుంచి 40 టీఎంసీల నీరు మన వాటాగా వస్తోంది. అత్యవసర సమయంలో మరో ఐదు టీఎంసీలు బైపాస్ పద్ధతిలో సేకరించడం ఆనవాయితీగా మారింది. గత ఏడాది ఏకంగా 54.50 టీఎంసీల నీటిని సీలేరు నుంచి తెప్పించినా పంట ఎండిపోయింది. ఈసారి మాత్రం సీలేరు కన్నా సహజ జలాలే ఎక్కువగా రావడం గమనార్హం. మొత్తం రబీ పంట కాలంలో ఈ నెల 15 నాటికి 54.971 టీఎంసీల సహజ జలాలు రాగా, సీలేరు నుంచి వచ్చింది 48.835 టీఎంసీలు మాత్రమే. పైగా ఫిబ్రవరిలో ఒకానొక సమయంలో రోజుకు రెండు వేల క్యూసెక్కులకు పడిపోయిన సహజ జలాలు మార్చి నెలలో అనూహ్యంగా 9 వేల క్యూసెక్కులకు పెరగడం విశేషం. ఆ సమయంలో పంట చేలు పాలు పోసుకుంటాయి. దీంతో నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. ఇదే నెలలో ఏకంగా 11.664 టీఎంసీల సహజ జలాలు బ్యారేజ్ వద్దకు వచ్చాయి. చివరకు ఏప్రిల్ నెలలో 15 రోజుల వరకూ 6.788 టీఎంసీల సహజ జలాలు రావడంతో డెల్టాలో రబీ పంట గట్టెక్కింది.
నెలవారీ నీటి వివరాలు (టీఎంసీలలో)
నెల కాలువలకు సీలేరు సహజ జలాలు
వదిలింది
డిసెంబర్ 25.292 7.991 17.301
జనవరి 23.144 9.936 13.208
ఫిబ్రవరి 19.279 13.269 6.010
మార్చి 25.113 13.449 11.664
ఏప్రిల్ 10.978 4.190 6.788
మొత్తం 103.806 48.835 54.971