ఉత్సాహంగా వాకథాన్‌ | walkdhan in beach road | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వాకథాన్‌

Jul 30 2016 11:41 PM | Updated on Jul 12 2019 4:29 PM

ఉత్సాహంగా వాకథాన్‌ - Sakshi

ఉత్సాహంగా వాకథాన్‌

సాగర తీరంలో ఏయూ, యునైటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ అండ్‌ భూటన్, ఎస్‌ వుయ్‌ కెన్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వాకథాన్‌ నిర్వహించారు.

బీచ్‌ రోడ్‌ : సాగర తీరంలో ఏయూ, యునైటెడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ అండ్‌ భూటన్, ఎస్‌ వుయ్‌ కెన్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వాకథాన్‌ నిర్వహించారు. వచ్చేనెల 12న ఇంటర్నేషనల్‌ యూత్‌డేను పురస్కరించుకుని బీచ్‌ రోడ్డులో నిర్వహించిన ఈ వాకథాన్‌ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా యూఎన్‌ఐసీ జాతీయ సమాచార అధికారి రవి చంద్రన్‌ మాట్లాడుతూ యువతకు స్థిరమైన అభివద్ధే లక్ష్యం కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు, జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్‌ బాబీవర్థన్, ఎస్‌ వుయ్‌ కెన్‌ సంస్థ వ్యవస్థాపకుడు స్టీఫెన్‌ అనురాగ్, ఎస్‌ వుయ్‌ కెన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement