జిల్లాలోని వెల్దుర్తి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బి.కవిత తన పదవికి రాజీనామా చేశారు.
వెల్దుర్తి వైస్ ఎంపీపీ రాజీనామా
Mar 22 2017 12:38 AM | Updated on Sep 5 2017 6:42 AM
కర్నూలు(అర్బన్): జిల్లాలోని వెల్దుర్తి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బి.కవిత తన పదవికి రాజీనామా చేశారు. వెల్దుర్తి నాలుగవ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన కవిత వ్యక్తిగత కారణాల వల్ల మంగళవారం జిల్లా పరిషత్‌కు వచ్చి జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సీఈఓ మాట్లాడుతూ వైస్ ఎంపీపీ రాజీనామాను ఆమోదిస్తున్నామని, ఖాళీ అయిన వైస్ ఎంపీపీ స్థానాన్ని భర్తీ చేసేందుకు విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామన్నారు. తిరిగి ఎప్పుడు ఎన్నిక నిర్వహించే అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందన్నారు.
Advertisement
Advertisement