కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం | veera brahmendra swamy rathothsavam | Sakshi
Sakshi News home page

కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం

Mar 9 2017 11:46 PM | Updated on Sep 5 2017 5:38 AM

కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం

కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం

మండలంలోని బచ్చేహళ్లి గ్రామంలో గురువారం వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండువగా జరిగింది.

శెట్టూరు : మండలంలోని బచ్చేహళ్లి గ్రామంలో గురువారం వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం కనులపండువగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతిపూజ, అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు హోమం, ఒంటి గంటకు మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గ్రామదేవతల పూజ, గంగపూజ చేపట్టారు.

అనంతరం 108 పూర్ణకుంభాలతో రథోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారికి పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రికి గ్రామ పెద్దల సహకారంతో సాంఘిక నాటిక ప్రదర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ శ్రీకాంత్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement