చిరుత దాడిలో లేగదూడ మృతి | cow dies of cheathah attcked | Sakshi
Sakshi News home page

చిరుత దాడిలో లేగదూడ మృతి

Aug 25 2017 12:37 AM | Updated on Sep 17 2017 5:55 PM

చిరుత దాడిలో లేగదూడ మృతి

చిరుత దాడిలో లేగదూడ మృతి

చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన శెట్టూరు మండలంలో సంచలనం రేకెత్తించింది.

బచ్చేహళ్లి (శెట్టూరు): చిరుత దాడిలో లేగ దూడ మృతి చెందిన ఘటన శెట్టూరు మండలంలో సంచలనం రేకెత్తించింది. వారం రోజుల్లో పశుసంపదపై చిరుత దాడి చేయడం ఇది రెండోసారి. వివరాల్లోకి వెళితే.. శెట్టూరు మండలంలోని బచ్చేహళ్లి గ్రామానికి చెందిన గొల్ల చిత్తక్క పాడిపోషణతో జీవనోపాధి పొందుతున్నారు.

బుధవారం రాత్రి తన పశువుల పాకలో చొరబడిన చిరుతపులి ఓ లేగదూడను గ్రామ శివారులోకి లాక్కెళ్లి తినేసింది. సమాచారం అం‍దుకున్న అటవీశాఖ అధికారులు రామచంద్రనాయక్‌, జగన్నాథ్‌.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. చిరుత దాడిలో రూ. 4వేలు నష్టపోయినట్లు ఈ సందర్భంగా వారి ఎదుట బాధిత చిత్తక్క వాపోయారు. చిరుతను బంధించాలని గ్రామస్తులు వేడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement