మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు.
బాధ్యతగా భావించి మొక్కలు నాటాలి
Jul 24 2016 11:28 PM | Updated on Sep 18 2018 6:30 PM
ఆదిలాబాద్ టౌన్ : మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ఎంతో దోహదపడుతాయన్నారు.
మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ విడుదల చేసి పర్యావరణాన్ని కాపాడుతాయన్నారు. నాటిన మొక్కలను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీష, కమిషనర్ అలివేలు మంగతాయారు, టీఆర్‌ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బాలురి గోవర్ధన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాజిదోద్దిన్, కౌన్సిలర్ జయశ్రీ, రైల్వే ఏఈ చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement