ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక | tourisam development planings | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక

Apr 30 2017 12:21 AM | Updated on Sep 5 2017 9:59 AM

రాష్ట్రంలో రెలిజియస్‌ టూరిజం (ఆధ్యాత్మిక పర్యాటకం)ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అన్ని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు రెలిజియస్‌ టూరిజం (దేవాదాయశాఖ) డైరెక్టర్‌ రత్నకుమార్‌ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం దేవాదాయశాఖ

రాజమహేంద్రవరం సిటీ : 
రాష్ట్రంలో రెలిజియస్‌ టూరిజం (ఆధ్యాత్మిక పర్యాటకం)ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అన్ని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించినట్లు రెలిజియస్‌ టూరిజం (దేవాదాయశాఖ) డైరెక్టర్‌ రత్నకుమార్‌ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం దేవాదాయశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేశామన్నారు. 400 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాల సందర్శన, పూజలు సహా అన్ని ఏర్పాట్లతో ఆర్టీసీ బస్సులను సమకూరుస్తున్నామని, పంచారామ యాత్రకు దేశవ్యాపంగా ప్రాచుర్యం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మ, కొల్లేరుకోట పెద్దింట్లమ్మ, భీమవరం మావుళ్లమ్మ, పెద్దాపురం మరిడమ్మ, అనకాపల్లి నూకాంబిక, విశాఖపట్నం కనకమహాలక్ష్మి, విజయనగరం పైడితల్లి అమ్మవార్ల దేవస్థానాలకు కలుపుతూ ప్యాకేజీ,  చేశామన్నారు. త్రిలింగ యాత్రగా శ్రీ«శైలం, శ్రీకాళహస్తి, దాక్షారామం, పిఠాపురం, ఒంటిమిట్ట, అమరావతి, మహానంది, అహోబిలం, తిరుపతి, మొదలగు ప్రాంతాలను సందర్శి«ంచేలా మరో ప్యాకేజీ సిద్దం చేశామన్నారు. విశాఖపట్నం నుంచి పూరి కళింగ కారిడార్‌ ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ చింతా రవికుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement