జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
నేడు కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
Apr 21 2017 11:10 PM | Updated on Mar 21 2019 8:35 PM
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కొత్త కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. ఈయనను ప్రభుత్వం జిల్లాకు కలెక్టర్‌గా నియమించింది. 1985లో కర్నూలు సిల్వర్‌జుబ్లీ కళాశాలలో డిగ్రీ చదివిన ఆయన ఇదే జిల్లాకు కలెక్టర్‌గా రావడం విశేషం. జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త కలెక్టర్‌కు స్వాగతం, బదిలీ అయిన కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వీడ్కోలు కార్యక్రమాన్ని సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement