నేడే నంద్యాల-కడప రైలు ప్రారంభం


నగరంపాలెం: నంద్యాల-కడప డీఈఎంయు రైలును రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం విజయవాడ నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తారని గుంటూరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలును ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు నంద్యాల నుంచి రెండు, కడప నుంచి రెండు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. రైలు నంబరు 77401 నంద్యాల నుంచి ఉదయం 06.00 గంటలకు బయలుదేరి కడపకు 09.45 గంటలకు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో 77402 కడప నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి నంద్యాలకు మధ్యాహ్నం 13.50 గంటలకు చేరుకుంటుంది. అలాగే రైలు నంబరు 77403 నంద్యాల నుంచి 14.20కి బయలుదేరి కడపకు 18.05 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో  77404 కడప 18.30కి బయలుదేరి 22.15 గంటలకు నంద్యాల చేరుకుంటుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top