
నేడు వైద్యుల ఆప్షన్లకు చివరి తేది
ఏ రాష్టంలో పని చేయాలన్న దానిపై ఆప్షన్లు ఇవ్వడానికి వైద్యులకు ఈ నెల 20 చివరి తేదీ కానుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు
ఇప్పటి వరకూ 2,200 మంది డాక్టర్లు ఏపీకి ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఏ రాష్టంలో పని చేయాలన్న దానిపై ఆప్షన్లు ఇవ్వడానికి వైద్యులకు ఈ నెల 20 చివరి తేదీ కానుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న వైద్యులు తమ ఆప్షన్లు ఇవ్వాలి. లేదంటే కమల్‌నాథన్ కమిటీనే వారిని ఎక్కడకు వేయాలో నిర్ణయం తీసుకుంటుంది. ఆప్షన్లకు సంబంధించి ఇప్పటికే వైద్యులందరికీ ఆన్‌లైన్‌లో ఆప్షన్ ఇవ్వాలని సమాచారమందించారు. దీనికి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా వారి సెల్‌ఫోన్లకు మెసేజ్ ద్వారా అందించారు.
ఇప్పటి వరకు ఏపీకి 2,200 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇంకా సుమారు 600 మంది ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. హైదరాబాద్‌లో పనిచేస్తున్న చాలామంది ఏపీ వైద్యులు తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్లు ఇచ్చినట్టు తెలిసింది. అతి కొద్దిమంది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ వయసు 60కి పెంచడం కారణంగా, ఏపీకి ఆప్షన్లు ఇచ్చారు.ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం రెండు నెలలు పైనే సమయం పట్టే అవకాశం ఉందని వైద్యవిద్యాశాఖ అధికారులు తెలిపారు.