జైత్రయాత్రను విజయవంతం చేయాలి | To be successful streak | Sakshi
Sakshi News home page

జైత్రయాత్రను విజయవంతం చేయాలి

Jul 26 2016 11:37 PM | Updated on Sep 4 2017 6:24 AM

జైత్రయాత్రను విజయవంతం చేయాలి

జైత్రయాత్రను విజయవంతం చేయాలి

నకిరేకల్‌ : ఆగస్టు 3న నకిరేకల్‌లో జరిగే సర్ధార్‌ సర్వాయి పాపన్న జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్‌ పిలుపునిచ్చారు

నకిరేకల్‌ : ఆగస్టు 3న నకిరేకల్‌లో జరిగే సర్ధార్‌ సర్వాయి పాపన్న జైత్రయాత్ర సభను విజయవంతం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజుగౌడ్‌ పిలుపునిచ్చారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్‌హాల్‌లో జరిగిన జైత్రయాత్ర సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పాపన్న జయంతి వేడుకలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై, జిల్లా కేంద్రాల్లో పాపన్న విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆగస్టు 2న నల్లగొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరి, నల్లగొండలో జైత్రయాత్రలు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘ నాయకులు కొప్పు అంజయ్య, పి.అచ్చాలు, బాదిని చెన్నయ్య, రాచకొండ వెంకన్నగౌడ్, రాచకొండ యాదగిరి, రామచంద్రు, నర్సింహ, దోరపల్లి లక్ష్మయ్య, బుచ్చిరాములు, సుధాకర్, సత్తయ్య, ముత్తిరాములు తదితరులు ఉన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement