దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
కొండమల్లేపల్లి : దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొండమల్లేపల్లి : దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వెనుకబడిన గిరిజన ప్రాంతమైన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాగా ప్రకటించకుంటే నేటి నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపడుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నేనావత్ వశ్యానాయక్, గాజుల మురళి, గాజుల రాజేష్, యాదయ్య, కృష్ణయ్య, అమరేందర్‌రెడ్డి, ఇమ్రాన్, నీలా రవికుమార్, ఇలియాస్, యాదగిరి, శివ, కొండల్, లక్ష్మికాంత్, మోతీలాల్, తౌఫిక్, రాందాస్, నాగార్జున, జావెద్ పాల్గొన్నారు.