దేవరకొండను జిల్లాగా ప్రకటించాలి
కొండమల్లేపల్లి : దేవరకొండ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
కొండమల్లేపల్లి : దేవరకొండ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చారిత్రక నేపథ్యం కలిగిన దేవరకొండను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇప్పటికే హైపవర్ కమిటీని కలిసి నివేదించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని దేవరకొండ, చింతపల్లి, పీఏపల్లి, చందంపేట, డిండి, కొండమల్లేపల్లి, నేరడుగొమ్ము, అచ్చంపేటలోని సిద్ధాపురం, కల్వకుర్తిలోని వంగూరు, చారగొండ, సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోయే క్రమంలో దేవరకొండకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మట్టిపల్లి వెంకటయ్య, నల్లగాసు జాన్‌యాదవ్, శిరందాసు కృష్ణయ్య, చీదెళ్ల గోపి, సుభాష్‌గౌడ్, రేణుగౌడ్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.