ఝండా ఉంఛారహే హమారా | tiranga rally at sangareddy | Sakshi
Sakshi News home page

ఝండా ఉంఛారహే హమారా

Sep 8 2016 8:54 PM | Updated on Nov 9 2018 4:51 PM

జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ - Sakshi

జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ

బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ నుండి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రం వరకు ర్యాలీ నిర్వహించారు.

  • సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్ర
  • సంగారెడ్డి టౌన్‌: బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐబీ నుండి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రం వరకు  ర్యాలీ నిర్వహించారు.  ర్యాలీని జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటేల్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలవుతున్న సందర్భంగా  దేశ వ్యాప్తంగా  తిరంగా యాత్ర  చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 

    కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, ఎస్పీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండాపురం జగన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్దన్‌ రెడ్డి, చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షులు నర్సింహా రెడ్డి, యువ మోర్చ నాయకులు విష్ణు, విజయ్, పవన్, ద్వారక రవి, సుదీర్‌ రెడ్డి, విద్యార్థులు, బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement