గురజాల మండలం పులిపాడు లో దారుణం వెలుగు చూసింది.
గురజాల మండలం పులిపాడు లో దారుణం వెలుగు చూసింది. ఓ వృద్దురాలిని దుండగులు హత్య చేసి పూడ్చి పెట్టారు. శవాన్ని పూడ్చిన స్థలంలో కుక్కలు తవ్వడంతో.. సోమవారం ఈ ఘటన బయట పడింది.
కుక్కలు తవ్విన చోట చీర బయటకు వచ్చింది. అది గమనించిన స్థానికులు పూర్తిగా తవ్వి చూడటంతో.. శవం బయట పడింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్‌ఐ సీహెచ్ వెంకట సురేష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.