పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు, గాలి వేగం స్వల్పంగా పెరిగాయి.
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు, గాలి వేగం స్వల్పంగా పెరిగాయి. చలి వాతావరణంం కొనసాగుతోంది. ఆదివారం మడకశిరలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 14 డిగ్రీలు, సోమందేపల్లి 14.6 డిగ్రీలు, రొద్దం 14.7 డిగ్రీలు కొనసాగింది.
మిగతా మండలాల్లో 15 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీల మధ్య ఉన్నాయి. గాలిలో తేమ శాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో వీచాయి.