
ఉత్సవంలా అవతరణ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించగా, కలెక్టరేట్‌లో జేసీ వినయ్‌కృషారెడ్డి ఆవిష్కరించారు. అదే విధంగా ఆర్‌డబ్లు్యస్, ఫారెస్ట్, ఆర్‌అండ్‌బీ కార్యాలయాల్లో ఆయా శాఖాల ఉన్నతాధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో: అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టపింజర రామయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొనదేన శ్రీనివాస్, శ్రీధర్, వల్లోజి శ్రీనివాసరావు, రమణ యాదవ్, గుంటుపల్లి శ్రీనివాస్, బాలకృష్ణ, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కళా పరిషత్, స్టార్ అకాడమీ ఆధ్వర్యంలో: ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ గుండు సుందర్, తెలంగాణ డాక్టర్స్ డైరెక్టర్ రాయల సతీష్ కేక్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో భుక్యా రాంబాబు, వసంత్, వనం నాగేంద్రకుమార్, వీరభద్రరావు, నటుడు తల్లాడ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.