'ఉపాధ్యాయ బదిలీలలో అక్రమాలపై విచారణ జరపాలి' | teachers transfers should be investegated | Sakshi
Sakshi News home page

'ఉపాధ్యాయ బదిలీలలో అక్రమాలపై విచారణ జరపాలి'

Aug 2 2015 10:25 PM | Updated on Sep 3 2017 6:39 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌లలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ డిమాండ్ చేశారు.

కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్‌లలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  రఘునందన్ డిమాండ్ చేశారు. ఆదివారం కామారెడ్డిలో టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవీసింగ్ అధ్యక్షతన సమా వేశం జరిగింది.

 

ఈ సందర్భంగా ఆయన రఘునందన్ మాట్లాడుతూ... వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలో అనేక అవకతవకలు, అవినీతి జరిగాయని, ప్రభుత్వం వరంగల్ డీఈవోను మాత్రమే సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. మిగతావారిపై తాత్సారం చేయడం సరికాదని, వారిపైనా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement