యువత.. సమాజానికి చేయూత | Students are participating in National Service Scheme | Sakshi
Sakshi News home page

యువత.. సమాజానికి చేయూత

Jan 7 2017 11:55 PM | Updated on Sep 5 2017 12:41 AM

యువత.. సమాజానికి చేయూత

యువత.. సమాజానికి చేయూత

వారంతా డిగ్రీ విద్యార్థులు నిత్యం పుస్తకాలతో కూస్తీపడుతూ కళాశాలకు వెళ్లడం వారి నిత్య పని.

జాతీయ సేవాపథకం పేరుతో గ్రామాల్లో సేవాకార్యక్రమాలు

లక్ష్మణచాంద : వారంతా డిగ్రీ విద్యార్థులు నిత్యం పుస్తకాలతో కూస్తీపడుతూ కళాశాలకు వెళ్లడం వారి నిత్య  పని.కాని గత మూడు రోజులుగా మండలంలోని చింతల్‌చాంద గ్రామంలో విద్యార్థులు అనేక రకాల పనులు చేస్తూ వీరు విద్యార్థులేనా అనే సందేహం కలిగేలాగా పని చేస్తున్నారు.వారే మండల కేంద్రానికి చెందిన ఎస్‌వీజీ డిగ్రీ కళాశాలకు చెందిన జాతీయ సేవాపథకం వాలింటీర్లు .మా కోసం కాదు మీ కోసం అనే నినాదంతో నెలకొల్పిన  కార్యక్రమం జాతీయ సేవాపథకం.

ఇందులో విద్యార్థులకు విధ్యతో పాటుగా సమాజం పట్ల ,ప్రజల పట్ల సమాజసేవ పట్ల  విద్యార్థులు భాగస్వాములు చేయాలనే గొప్ప సంకల్పంతో ఆనాటి భారత ప్రధాని జాతీయ సేవా పథకం అనే ఒక కార్యక్రమంను రూపొందించారు. అలా ఏర్పడిన జాతీయ సేవా పథకం భారతదేశంలో అనేక కార్ర్యక్రమాలలో పాలుపంచుకొంటు తమకంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది.అందులో భాగంగానే మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు ప్రతీ సంవత్సరం మండలంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ 7రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపడుతూ గ్రామంలోని పౌరులను చైతన్యం చేయడంతో తమవంతూగా కృషి చేస్తుంది.

ఈ సంవత్సరం చింతల్‌చాందలో
ప్రతీ సంవత్సరంలాగానే ఈ సంవత్సరం మండలం లోని చింతల్‌చాంద గ్రామాన్ని దత్తత తీసుకొన్నారు. గ్రామంలో ప్రజలను చైతన్యం చేయడం మండలం లోని చింతల్‌చాందలో జాతీయ సేవా పథకం ద్వా రా గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంకు అదికారుల వద్దకు తీసుకెళ్లి వాటి పరిష్కారంకు  కృషి చేస్తోంది. దీనిలో భాగంగానే చింత్‌చాందలో వాలింటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకొని నమోదు చేసుకుంటారు.

మూడో రోజు కొనసాగిన కార్యక్రమం
మూడో రోజు వాలింటీర్లు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను అంగన్ వాడీ కేంద్రం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను,గ్రామంలోని మురికి నీటి కాలువలను శుభ్రం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement