ఆగస్టు 2న స్పాట్‌ అడ్మిషన్లు | spot admission gurukul college | Sakshi
Sakshi News home page

ఆగస్టు 2న స్పాట్‌ అడ్మిషన్లు

Jul 30 2016 6:36 PM | Updated on Sep 5 2018 8:36 PM

రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆగస్టు 2న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఏవీ.రంగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

గురుకులంలో డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 2న స్పాట్‌ అడ్మిషన్లు

మొయినాబాద్‌: రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆగస్టు 2న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఏవీ.రంగారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2016-17 విద్యా సంవత్సరానికి వికారాబాద్‌, ఎల్‌బీ.నగర్‌, జగద్గిరిగుట్ట గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో బీఎస్సీ (ఎంపీసీ) ఎంజెడ్‌సీ, బీజెడ్‌సీ, బీకాం (జనరల్‌), బీకాం (కంప్యూటర్స్‌), బీఏ (హెచ్‌ఈపీ) కోస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్సీ విద్యార్థినిలకు 278, ఎస్టీకి 4, బీసీకి 10, మైనార్టీలకు 12, హరిజన క్రిస్టియన్స్‌కు 11 సీట్లు కేటాయించామన్నారు. 2015, 2016 సంవత్సరాల్లో ఇంటర్‌ పాసైన అభ్యర్తులు, అడ్వాన్స్‌ సప్లమెంటరీలోనూ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. గతంలో దరఖాస్తు చేసినవారు, చేయనివారు సైతం ఆగస్టు 2వ తేదీ ఉదయం 11 గంటలలోపు చిలుకూరులోని గురుకుల విద్యాలయంలో నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్‌కు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్‌కు చెందిన వారు సెల్‌: 98487 03737, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు సెల్‌: 99892 69715 లలో సంప్రదించవ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement