పరిశోధనల్లో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) ప్రత్యేక గుర్తింపు పొందిందని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ (ఏడీఆర్) గోపాల్‌రెడ్డి తెలిపారు.
పరిశోధనల్లో ఆర్‌ఏఆర్‌ఎస్‌కు ప్రత్యేక గుర్తింపు
Feb 17 2017 12:25 AM | Updated on Jun 4 2019 5:04 PM
– దిగ్విజయంగా 110 సంవత్సరాలు పూర్తి
- వివరాలు వెల్లడించిన ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి
నంద్యాలఅర్బన్: పరిశోధనల్లో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) ప్రత్యేక గుర్తింపు పొందిందని అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ (ఏడీఆర్) గోపాల్‌రెడ్డి తెలిపారు. గురువారం..ఆర్‌ఏఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1906 బ్రిటీష్ కాలంలో డాక్టర్ జీఆర్ హిల్సన్ అధిపతిగా ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రారంభమైందన్నారు. ఇప్పటికి 110 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. పత్తి, పొగాకు, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై పరిశోధనలు చేసి.. 2015లో నాలుగు వంగడాలు, 2016 మూడు వంగడాలను విడుదల చేశామని తెలిపారు. వరి, జొన్న, కొర్ర, పత్తి, శనగ, పొద్దుతిరుగుడు తదితర పంటల్లో విప్లవాత్మకమైన పరిశోధనలు కొనసాగాయని వివరించారు.
Advertisement
Advertisement