‘సోయా’కు పెంకు పురుగు బెడద | soya crop effect with worms | Sakshi
Sakshi News home page

‘సోయా’కు పెంకు పురుగు బెడద

Aug 26 2016 5:53 PM | Updated on Oct 17 2018 6:10 PM

‘సోయా’కు పెంకు పురుగు బెడద - Sakshi

‘సోయా’కు పెంకు పురుగు బెడద

జగిత్యాల అగ్రికల్చర్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాలోని కరీంనగర్, అదిలాబాద్, నిజమాబాద్‌ జిల్లాలో సోయా సాగు చేసిన రైతులకు పెంకు పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరీంనగర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, అదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ, బోరిగామ, కామగిరి, నిజమాబాద్‌ జిల్లాలోని బాల్కొండ తదితర మండలాల్లో విత్తనోత్పత్తి కింద సాగు చేసిన సోయాబీన్‌ పంటను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో

  • కాండం తొలుస్తున్న పురుగులు 
  • ఆందోళనతో రైతులు
  • పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం
  • నివారణ చర్యలకు సూచనలు 
  • జగిత్యాల అగ్రికల్చర్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాలోని కరీంనగర్, అదిలాబాద్, నిజమాబాద్‌ జిల్లాలో సోయా సాగు చేసిన రైతులకు పెంకు పురుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరీంనగర్‌ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, అదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ, బోరిగామ, కామగిరి, నిజమాబాద్‌ జిల్లాలోని బాల్కొండ తదితర మండలాల్లో విత్తనోత్పత్తి కింద సాగు చేసిన సోయాబీన్‌ పంటను తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం డాక్టర్‌ వెంకటయ్య(98484 93441), డాక్టర్‌ కిరణ్‌బాబు, డాక్టర్‌ మధుకర్‌రావులు సందర్శించారు. కాండం తొలిచే పెంకు పురుగు నివారణ చర్యలను రైతులకు వివరించారు.
     
    కాండం తొలిచే పెంకు పురుగు..
    ప్రస్తుతం సోయాబీన్‌ పంట పూత దశ నుంచి కాయలు ఏర్పడే దశలో ఉంది. ఇప్పుడు పంటను కాండం తొలిచే పురుగు ఆశించి నష్టం కలిగిస్తోంది. ప్రధానంగా తల్లి పెంకు పురుగు మొక్క కాండం మీద అర్థ చంద్రకారంలో రెండు రం్ర«ధాలు చేసి అందులో గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి గ్రబ్స్‌ పొదిగి కాండం లోపలికి పోయి కాండం, ప్రక్క కొమ్మల లోపలి మొత్తం పదార్థం తినడం వలన కొమ్మల చివరి భాగాలు కత్తిరించినట్లు అయి ఎండిపోయి మొక్కలు చనిపోతున్నాయి. 
     
    నివారణ ఇలా.. 
    పెంకు పురుగు నివారణకు ఎకరానికి 400 మిల్లీ లీటర్ల ప్రొపినోఫాస్‌  లేదా 400 మిల్లీ లీటర్ల క్వినాల్‌ ఫాస్‌తో పాటు 200 మిల్లీ లీటర్ల డైక్లోరోవాస్‌ కలిపి లేదా 60 మిల్లీ లీటర్ల క్లోరాంథ్రనిల్‌ ప్రోల్‌(కోరాబిన్‌) లేదా 100 గ్రాముల ఎమోమెక్టిన్‌ బెంజోయేట్‌ను కలిపి పిచికారీ చేయాలి. మందు కింద పడిపోకుండా తుంపర్లు, తుంపర్లు పడేటట్లుగా పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. 
     
    కాండం తొలిచే ఈగ.. 
    విత్తిన 20–30 రోజుల దశలో ఉన్న సోయా పంటను ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో ఈగ ఎక్కువగా ఆశిస్తుంది. ఈగ ఆశించిన మొక్కలు పైకి చూడటానికి కొన్ని రోజుల వరకు ఆరోగ్యంగా, పచ్చగా కన్పిస్తాయి. ఈ పురుగు దాదాపు 15–20 శాతం వరకు నష్టం కలిగిస్తుంది. కాండం తొలిచే ఈగలు లేత కాండంపైన లేదా ఆకులపై చిన్న గుంతలు చేసి గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి 7–8 రోజుల్లో బయటకు వచ్చిన పిల్లలు ప్రధాన కాండంలోని మెత్తని ఆహార పదార్థం తినడంతో మొక్కలలోని ఒకటి లేదా రెండు ఆకులు వడలి ఎండిపోతాయి. పంటలో అక్కడక్కడ వడలిపోయిన మొక్కల కాండం చీల్చి చూస్తే ఎరుపు–గోధుమ రంగు సొరంగాలు కన్పిస్తాయి. అందులో పిల్ల పురుగుల నిద్రావస్థలను కూడా చూడవచ్చు. ఆలస్యంగా విత్తిన పంటల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది.
    నివారణ ఇలా.. 
    కాండం తొలిచే ఈగల నివారణ కు..1.5 గ్రాముల ఎసిఫేట్‌ను లీటర్‌ నీటికి(ఎకరానికి 300 గ్రాములు) లేదా 2 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్‌ను లీటర్‌ నీటికి(ఎకరానికి 400 మిల్లీ లీటర్లు) లేదా 2 మిల్లీ లీటర్ల డైమిథోయేట్‌ను లీటర్‌ నీటికి(ఎకరానికి 400 మిల్లీ లీటర్లు) పిచికారీ చేయాలి.  
     
    ఆశిస్తున్న తెల్లదోమ..
    ఆగస్టు మొదటి వారం నుంచి బెట్ట పరిస్థితులు ఉండడంతో సోయాను రసం పీల్చే తెల్లదోమ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది. తెల్లదోమను గుర్తిస్తే  గడ్డి జాతి కలుపు మొక్కలైన తుంతరు బెండ లాంటి వాటిని పీకి నాశనం చేయాలి. దీని నివారణకు..5 మిల్లీ లీ టర్ల వేపనూనెను ఒక లీటర్‌ నీటికి లేదా 2 మిల్లీ లీటర్ల ట్రయజోఫాస్‌ను లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement