రెండో రోజు రూ.3 కోట్ల మద్యం కొనుగోలు | seconday Rs.3cr liquior sale | Sakshi
Sakshi News home page

రెండో రోజు రూ.3 కోట్ల మద్యం కొనుగోలు

Jul 4 2017 12:20 AM | Updated on Jul 18 2019 2:26 PM

నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు సోమవారం రెండో రోజు రూ.3 కోట్లు విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు.

కర్నూలు : నూతన మద్యం పాలసీలో భాగంగా అనుమతి పత్రాలు పొందిన వ్యాపారులు సోమవారం రెండో రోజు రూ.3 కోట్లు విలువ చేసే మద్యం కొనుగోలు చేశారు. 6,211 బాక్సుల లిక్కర్, 2,950 బాక్సుల బీర్లను కొనుగోలు చేసి దుకాణాలకు తరలించారు. మొదటి రోజు 26 మంది దుకాణదారులు రూ.1.50 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయగా, రెండో రోజు  రూ.3 కోట్ల మద్యాన్ని తీసుకోవడం గమనార్హం. కల్లూరు శివారులోని హంద్రీ నది ఒడ్డున ఉన్న ఐఎంఎల్‌ డిపో రెండు రోజులుగా మద్యం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది.  ఇప్పటివరకు లైసెన్స్‌ పొందిన  57 మందిలో ఇంకా ఐదుగురు వ్యాపారులు మద్యం కొనుగోలుకు రాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement