సంగంలో అటవీ భూముల పరిశీలన
సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని అటవీ భూములను అటవీశాఖ అధికారులు, అటవీ విజిలెన్స్ అధికారులు గురువారం పరిశీలించారు.
సంగం : మండల కేంద్రమైన సంగం సమీపంలోని అటవీ భూములను అటవీశాఖ అధికారులు, అటవీ విజిలెన్స్ అధికారులు గురువారం పరిశీలించారు. నెల్లూరు – ముంబై జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అనుమతులకు మించి అటవీశాఖ భూములు వాడుకున్నారనే విషయంపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఫారెస్ట్ రేంజర్ ఉమామహేశ్వరరెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను అనుమతి ఇచ్చిన మేరకే అటవీ భూములను వినియోగించుకోవాలని, అంతకుమించి వాడితే అటవీ చట్టాల ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు– ముంబై జాతీయ రహదారి, సంగం తిప్ప మీద నుంచి వెళ్లే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఫారెస్ట్ రేంజర్ రాంకొండారెడ్డి పాల్గొన్నారు.