మాస్కో టు శ్రీకాళహస్తి | Russians conduct puja for pregnancy in Srikalahasti Temple | Sakshi
Sakshi News home page

మాస్కో టు శ్రీకాళహస్తి

Jan 4 2016 9:45 PM | Updated on Sep 3 2017 3:05 PM

మాస్కో టు శ్రీకాళహస్తి

మాస్కో టు శ్రీకాళహస్తి

రష్యాకు చెందిన భక్తులు సంతానం కోసం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేశారు.

శ్రీకాళహస్తి (చిత్తూరు): ఇప్పటికే ఖండాంతరాలకు పాకిన శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి సోమవారం మరో రుజువు లభించింది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసంతో రష్యాకు చెందిన 16 మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాస్కో నగరం నుంచి వచ్చిన వీరు రూ.2,500 టిక్కెట్ కొనుగోలు చేసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయుంలోని స్వామి, అవ్మువార్లతోపాటు పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయు ఆవరణలో 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేసుకుంటే వివాహం కాని వారికి పెళ్లవుతుందనీ, సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుందని మాస్కోలో ఉంటున్న చెన్నైకి చెందిన వారు చెప్పారని, అందుకే ఇక్కడికి వచ్చామని, ఆలయు శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement