టెక్కలిలో భారీగా ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీగా ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న వ్యాన్‌ను ఆపి పోలీసులు తనిఖీ చేయగా అందులో సుమారు 50 బాక్సులలో ఉన్న ఖైనీ ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. వ్యాన్‌ను, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.