తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ | Sakshi
Sakshi News home page

తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ

Published Sat, May 28 2016 3:44 PM

Robbery in Gajwel

గజ్వేల్ (మెదక్) : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు వరుసగా మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లోని సిరి ఎన్‌క్లేవ్‌లో శనివారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న మూడు ఇళ్లలో దొంగలు పడి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 30 వేల నగదుతో పాటు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు.

Advertisement
Advertisement