మట్టి గణపతులు చేసేవారికి బహుమతులు | Rewards those who work the soil ganesha | Sakshi
Sakshi News home page

మట్టి గణపతులు చేసేవారికి బహుమతులు

Aug 21 2016 10:09 PM | Updated on Sep 4 2017 10:16 AM

మట్టిగణపతులను తయారు చేసేవారికి పీసీబీ బహుమతులు అందజేయనుంది.

సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణానికి హానికలగని రీతిలో సహజరంగులతో మట్టిగణపతులను తయారు చేసేవారికి పీసీబీ బహుమతులు అందజేయనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివాస సముదాయాలు, కాలనీలు, అసోసియేషన్లు, ఎన్‌జీఓలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నారు.

తాము తయారు చేసే మట్టిగణపతులను సెప్టెంబరు 7న సాయంత్రం 5 గంటలలోగా సనత్‌నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఒక ప్రకటనలో కోరారు. ఇందులో తయారీదారుల వివరాలు, చిరునామా, కాంటాక్ట్‌ ఫోన్‌ నెంబరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement