breaking news
Soil ganesha
-
‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’
సాక్షి, విజయవాడ : పర్యావరణ హిత వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు అందరూ తోడ్పడాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. విజయవాడలోని మెఘల్ రాజపురం సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’ శిక్షణా శిబిరం కార్యక్రమాన్నిశనివారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఎస్ఎస్ ప్రసాద్, బోర్డు కార్యదర్శి వివేక్ యాదవ్ హజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ...రసాయన రంగులతో కూడిన గణపతి విగ్రహాలు వినియోగించడం వల్ల పర్యావరణానికి హానికరం అన్నారు. విగ్రహాల తయారిలో రసాయన రంగులను వాడి మంచి నీటి జలాశయాలను కలుషితం చెయవద్దని విఙ్ఞప్తి చేశారు. రంగు రంగుల పెద్ద విగ్రహాలను వాడి నిమజ్జనం చేసి కాలుష్యానికి కారకులు కాకుండా, మట్టి విగ్రహాలను వాడాలని సూచించారు. అదే విధంగా నిమజ్జనానికి ముందు ప్లాస్టిక్, ఇతర కరగని ఆభరణాలను తొలగించాలని పేర్కొన్నారు. బోర్టు సెక్రెటరీ వివేక్ యాదవ్ మాట్లాడుతూ..చిన్నపిల్లలకు కాలుష్యంపై అవగాహన కల్పించడానికి ‘చిన్నారుల చేతుల్లో మట్టి గణేశుడు’ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. భావి తరాల బంగారు భవిత వీరిదే కాబట్టి మట్టి వినాయకుల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. -
మట్టి గణపతికి జై
సాక్షి, సిటీబ్యూరో : గణనాథుల పండగ సమీపిస్తోంది. ఈ ఏడు పండగ తనతో పాటు నగర వాసుల్లో పర్యావరణ స్పృహను మోసుకొస్తోంది. గతానికి పూర్తి భిన్నంగా కాలనీలు, అపార్ట్మెంట్ సంఘాలు మహా నగర పర్యావరణానికి విఘాతం కలగని రీతిలో మట్టి గణపతులకు జైకొడుతున్నాయి. ఆలివ్, ట్రీగార్డ్, రెయిన్బో విస్టా సంస్థలతో కలిసి ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆదివారం నుంచి మట్టి గణపతుల తయారీలో శిక్షణ, పంపిణీకి శ్రీకారం చుడుతోంది. మరో వైపు కాలుష్య నియంత్రణ మండలితో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వివిధ ఆకృతుల్లో మట్టి గణపతులను అందుబాటులోకి తేబోతున్నాయి. నేటి నుంచి తయారీ–శిక్షణ: మట్టి గణనాథుల తయారీపై ‘సాక్షి–ఆలివ్ మిఠాయి’ సంయుక్తంగా నగరంలోని రెయిన్బో విస్టా, మలేషియన్ టౌన్షిప్ (రెయిన్ ట్రీపార్క్) తదితర గేటెడ్ కమ్యూనిటీల్లో ఈనెల 28న (ఆదివారం)ఉదయం విగ్రహాల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నాయి. మట్టితో తయారు చేసే ప్రతిమలను స్థానికులకు అక్కడే ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆలివ్ మిఠాయి సంస్థల అధినేత దొరరాజు తెలిపారు. ఇళ్లలో పూజించుకునేందుకు సుమారు 5 వేల ప్రతిమలను గ్రేటర్ వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. -
మట్టి గణపతులు చేసేవారికి బహుమతులు
సాక్షి, సిటీబ్యూరో: పర్యావరణానికి హానికలగని రీతిలో సహజరంగులతో మట్టిగణపతులను తయారు చేసేవారికి పీసీబీ బహుమతులు అందజేయనుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నివాస సముదాయాలు, కాలనీలు, అసోసియేషన్లు, ఎన్జీఓలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నారు. తాము తయారు చేసే మట్టిగణపతులను సెప్టెంబరు 7న సాయంత్రం 5 గంటలలోగా సనత్‌నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఒక ప్రకటనలో కోరారు. ఇందులో తయారీదారుల వివరాలు, చిరునామా, కాంటాక్ట్ ఫోన్ నెంబరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపికైన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
నిమర్జనం జాగ్రత్త
జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జనం భక్తి పారవశ్యంతో ఆదిదేవున్ని కొలుస్తున్నారు. మరికొన్నిచోట్ల మాలధారణలు, కంకణధారణలు స్వీకరించి తమదైన రీతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఇంకొన్నిచోట్ల పర్యావరణ పరిరక్షణ కు మట్టి వినాయకులను ప్రతిష్టించి ప్రత్యేకత చాటుకుంటున్నారు. మంటపాల్లో నిర్వాహకులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఉత్సవాలతో పాటే ప్రమాదాలూ పొంచి ఉన్నాయనే విషయాన్ని మరవొద్దు. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న నవరాత్రులను అంతే ఆనందంతో ముగించుకోవాల్సిన అవసరం ఉంది. నిమజ్జనోత్సవంలో ఎలాంటి అశుభ ఘడియలు చోటు చేసుకోకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సంబురాలు విజయవంతం చేయొచ్చు. - కరీంనగర్ క్రైం → నిమజ్జనోత్సవం విజయవంతం చేద్దాం.. → కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తేనే క్షేమం → మండళ్ల నిర్వాహకులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల చోదకులు ఇవి పాటించాలి నిమజ్జన శోభాయాత్రలో ప్రధానంగా ఆయా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహనాల డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిమలను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు వస్తుంటారు. కాబట్టి ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందుగానే సదరు డ్రైవర్లకు సూచనలివ్వాలి. ►అనుభవజ్ఞులైన డ్రైవర్లనే ఎంచుకోవాలి. ►డ్రైవర్‌కు ముందుగానే పోలీసులు, ఉత్సవ సమితి వారు సూచించిన సూచనలు, సలహాలను ఇవ్వాలి. ►డ్రైవర్ పూర్తిగా డ్రైవింగ్‌పైనే దృష్టి పెట్టాలి. ►మద్యం, మత్తు పానీయాలు, పదార్థాలకు దూరంగా ఉండాలి. ►ముందు, వెనుక, పక్కభాగాలను పరిశీలిస్తూ డ్రైవింగ్ చేయాలి. ►డ్రైవర్ పక్కన ఎవరినీ కూర్చోనివ్వద్దు. అలాగే వాహనం ముందు భాగంలో ఎవరినీ కూర్చోనివ్వకూడదు. ►రోడ్లపై ఉండే గతుకులు, గుంతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ►విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వినాయక ప్రతిమకు తగిలే అవకాశం ఉంటే అవి వెళ్లే వరకు పూర్తి శ్రద్ధతో వాహనం నడిపి వాటిని తప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోనుకాకూడదు. ►ట్రాక్టర్ పైన ప్రతిమ వద్ద ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. ►డ్రైవర్‌ను సదరు నిర్వాహకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. కుటుంబీకులూ తమ వంతుగా... ►శోభాయాత్ర, నిమజ్జన సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. ►నిమజ్జనానికి చిన్నారులను ఒంటరిగా పంపించకుండా, తెలిసిన వారితో గానీ, కుటుంబ సభ్యుల్లోని వారితో గానీ వెళ్లేలా చూసుకోవాలి. ►ఎలాంటి దుర్వ్యసనాలకు లోనుకాకుండా చూసుకోవాలి. మత్తు పానీయాలు, పదార్థాలకు లోనుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి. ►క్రమశిక్షణ, శాంతియుతంగా ఉండాలని ఆదేశించాలి. ►శోభాయాత్ర తిలికించేందుకు చాలా మట్టుకు ప్రజలు డాబాల పైకి ఎక్కి తిలకిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చుట్టూ ప్రహారి ఉన్న డాబాలపైకి ఎక్కి తిలకించాలి. అలాగే సమీపంలో విద్యుత్ తీగలు ఉంటే వాటికి దూరంగా ఉండాలి. సెట్టింగ్‌ల విషయంలో... వినాయక నిమజ్జనోత్సవ శోభాయాత్ర భక్తి ప్రపత్తుల మధ్య జరుపుకోవాలి. ఇందులో ప్రధానంగా క్యూ పద్ధతి పాటించడం మేలు. ఒక బండి తర్వాత ఇంకో బండి వరుస క్రమంలో వెళ్తే ఎవరికీ ఇబ్బందులు ఉండవు. తిలకించే భక్తులకూ సౌకర్యంగా ఉంటుంది. ►శోభాయాత్రలో పూర్తిగా సంయమనం పాటించాలి. ►ఎలాంటి ఉద్వేగాలకు పోకూడదు. ►కేటాయించిన నెంబర్ల ప్రకారమే క్రమపద్ధతిలో వెళ్లాలి. ►ఉత్సవ సమితి వారు, పోలీసులు సూచించినవిధి విధానాలు పాటించాలి. ఉత్సవాల్లో భాగంగా ఆయా మండపాలను భారీ సెట్టింగులతో వేసి వచ్చే భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని నింపేందుకు చాలా చోట్ల ప్రత్యేక ఏర్పాట్లను ఇప్పటికే చేశారు. మరికొన్ని చోట్ల సెట్టింగులు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే.. వేసే సెట్టింగుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. ►కరెంటు వైర్ల కింద నుంచి సెట్టింగులు ఉండ కుండా జాగ్రత్త పడాలి. ►లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. తెగిపోవడం, జాయింట్లు వేయడం వంటివి లేకుండా చూసుకోవాలి. ►సెట్టింగుల సమీపంలో బాణసంచాలు పేల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ►అగ్ని ప్రమాదాలు సంభవించే వాటిని సమీ పంలో ఉంచకుండా చూసుకోవాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వాటిని ఆర్పేందుకు వీలుగా అవసరమైన నీటిని, ఇసుకను అందుబాటులో ఉంచాలి. ►ఆది దేవున్ని దర్శించుకునే భక్తులకు ప్రతిమ వద్దకు వెళ్లేందుకు వీలుగా పకడ్బందీగా మెట్లు, స్టేజీలను ఏర్పాటు చేయాలి. ►దర్శించుకునేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఎలాంటి తోపులాటలు జరుగకుండా ఒకరి తర్వాత ఒకరు దర్శించుకు నేలా భారీ కేడ్లను ఏర్పాటు చేయాలి. ►వర్షపు నీరు లోపలికి రాకుండా పైభాగంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, మండపాల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ►రాకపోకలు సాగించే ప్రజలకు, వాహనచోదకులకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిమజ్జనం సమయంలో... ►ప్రతిమలను ప్రవహించే నదులు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, లోతైన వాటిల్లో నిమజ్జనం చేస్తారు. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ►నిమజ్జన సమయంలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే క్రెయిన్లు, తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు. ►సూచనలు, విధివిధానాలు తప్పక పాటించాలి. ►పోలీసులు, నిమజ్జనం చేసే సదరు నిర్వాహకుల హెచ్చరికలు కాదని చెరువులు, నదులు, కుంటలు, ప్రాజెక్టుల నీటిలోకి వెళ్లేందుకు సాహసించకూడదు. ►నీటి లోపలికి ఎవరూ వెళ్లకూడదు. అందులోనూ ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగకూడదు. కరెంటు వైర్ల వద్ద జాగ్రత్త.. ►నిమజ్జన శోభాయాత్ర సమయంలో చాలా సందర్భాల్లో కరెంటు తీగలతో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అలాంటి వాటి పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ►కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను ముందుగానే విద్యుత్ శాఖ వారు సరిచేయాలి. ►శోభాయాత్ర సమయంలో లైటింగ్, విద్యుత్ కోసం వాడే వైర్లు నాణ్యమైన కంపెనీవే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోవడం, జాయింట్లు ఉన్న వైర్లను వినియోగించ కూడదు. ►జనరేటర్‌ను ప్రతిమ ఉన్న వాహనంలో ఉంచకుండా, దాని వెనుక భాగంలో ఒక వాహనంలో గానీ, ట్రాలీలో గానీ ఉండేలా చూసుకోవాలి. ముందు వాహనం కదిలిన సమయంలో వెనువెంటనే జనరేటర్ కదిలేలా అప్రమత్తంగా ఉండాలి. ►విద్యుత్ తీగలు ప్రతిమకు తగిలే అవకాశం ఉందనిపిస్తే వెంటనే వాటిని పైకిలేపేందుకు ప్రత్యేక కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. వైర్లు దాటే వరకు అప్రమత్తంగా ఉండాలి. ►శోభాయాత్రలో బాణసంచాలు, తదితర పేలుడు పదార్థాలు ఉపయోగించరాదు. ►అగ్ని ప్రమాదం సంభవిస్తే వాటిని నివారించేందుకు ప్రతిమ వెంట వాహనంలో అవసరమైనంత మేర నీళ్లు, ఇసుకను బకెట్లలో ఉంచుకోవాలి. భక్తి పారవశ్యం చాటుదాం.. ►నిత్యం ఎంతటి భక్తితో ఆదిదేవున్ని కొలిచామో అదే మాదిరిగా నిమజ్జన శోభాయాత్రలోనూ ప్రతి ఒక్కరూ భక్తి పారవశ్యంతో విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరున్ని కొలవాలి. ►భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ఇష్టారీతిన పారే యకుండా చేతికి అందివ్వాలి. ►భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో సామరస్యపూర్వక వాతావరణం కలిగేలా చూడాలి. ►నిర్వాహకులు శాంతి, సామరస్యపూర్వకంగా ఉండాలి. ►ప్రధానంగా ఊరేగింపు సమయంలో ఆధ్యాత్మిక చింతన ప్రజ్వరిల్లేలా దేశ సంస్కతి, సంప్రదాయాలను వెల్లివిరిసే భక్తి పాటలు, నృత్యాలు, కోలాటాలు తదితర వాటిని చేసుకుంటూ వెళ్లాలి. ►తిలకించేందుకు వచ్చే చిన్నారులు, మహిళలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. ►మండపాల నిర్వాహకులు తమతో వచ్చే సభ్యులను తీసుకెళ్లడంతో పాటు వారిని తిరిగి ఇంటికే చేర్చే వరకు బాధ్యతగా వ్యవహరించాలి. ►ఏదైనా చిన్న సంఘటన జరిగితే దానిని సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చూడాలి. సమాచారం ఇవ్వండి.. -
ఫెస్ట్ ఫర్ బెస్ట్
అందలమెక్కించే ఆలోచనలు ఎన్ని ఉన్నా.. అదృష్టాన్ని వెక్కిరించే శక్తులు అడుగడుగునా ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితులను ఎదిరించలేక దురదృష్టవంతుల లిస్ట్‌లోకి చేరిపోతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారికి సరైన అవకాశం కల్పిస్తే.. వారి సృజనాత్మకత సంచలనాలకు నాంది పలుకుతుంది. అలాంటి ఆలోచనలున్న వారికి చేయూతనిస్తోంది ఆగస్ట్ ఫెస్ట్. నలుగురు ఇంజనీర్ల ఊహాశక్తి నుంచి ఉద్భవించిన ఈ సంస్థ ఈ నెల 30, 31 తేదీల్లో ఔత్సాహిక నిపుణుల సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఫెస్ట్ కన్వీనర్ పెరుగు సురేష్ తమ లక్ష్యాలను ‘సిటీప్లస్’కు వివరించారు. మట్టి గణపతి ప్రతిమలనే వాడాలని కోరుతున్నారు హ్యాంప్‌షైర్ ష్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ మంగళవారం పంజాగుట్టలోని ఇనిస్టిట్యూట్‌లో ర్యాంప్‌వాక్ నిర్వహించారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన నేను అమెరికాలోని ఐటీ కంపెనీల్లో పనిచే శాను. నా మిత్రుడు సుబ్బరాజు పేరిచర్ల ప్రముఖ కంపెనీల్లో హెచ్ఆర్గా పనిచేశాడు. ఇంకో మిత్రుడు కిరణ్‌చౌదరి గూగుల్ కంపెనీలో జాబ్‌తో సంతృప్తి పడలేదు. మరో ఇంజనీర్ స్నేహితుడు వేమూరి ఆదినారాయణ. ఓ రోజు మాట ల్లో ఉండగా మా నలుగురికి కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. అలా 2011లో సొంతంగా ఈట్ అండ్ స్లీప్ అనే స్టార్టప్ బ్రాండ్‌తో షార్ట్ ఫిలిమ్ తీశాం. అక్కడితో ఆగాలనుకోలేదు. మాలాంటి వారిని పెద్ద కంపెనీలు ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించాం. అందుకు వేదికగా ఆగస్ట్ ఫెస్ట్ ప్రారంభించాం. గతేడాది 500 మంది ఔత్సాహికులను ఈ వేదికపైకి తెచ్చాం. సత్సంకల్పం.. ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్, ఆర్ట్, టెక్నాలజీ రంగాల్లో మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్లు ఎందరో మన చుట్టూ ఉన్నారు. వీరిలో చాలామంది పనితనం నాలుగు గోడలకే పరిమితం అవుతోంది. అదే సమయంలో ఇలాంటి కొత్త ఐడియాల కోసం అనేక కంపెనీలు వెదుకుతున్నాయి. ఈ ఇద్దరిని ఒకే చోట చేర్చే అవకాశం ఆగస్ట్ ఫెస్ట్ కల్పిస్తుంది. చక్కటి వేదిక.. ప్రపంచంలోనే మంచి పేరున్న నాస్కామ్.. ఈ ఔత్సాహికులను ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకూ 1,300 దరఖాస్తులు వచ్చాయి. వాటిల్లో 160 మందిని నాస్కామ్ గుర్తిస్తుంది. ఔత్సాహికునికి ఉన్న లక్షణాలు, చేసే ప్రాజెక్టు ఉన్న మార్కెట్ విలువ, ఏ వర్గాన్ని అది టార్గెట్ చేస్తుంది..? ఇలా అనేక కోణాల్లో ఆలోచించిన తర్వాతే ఎంపిక జరుగుతుంది. అదే విధంగా బెంగళూరు, ముంబైకి చెందిన పలు కంపెనీలు కూడా ఎంపికైన ప్రాజెక్టులను పరిశీలిస్తాయి. ఎంపికైన వాటికి పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తాయి. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి షార్ట్ ఫిలిమ్స్ తీయడం సరదా. సినిమాల్లో లేని క్రియేటివిటీ అందులో కన్పిస్తుంది. దీన్ని ఆగస్ట్ ఫెస్ట్ ద్వారా సురేష్ ప్రొడక్షన్స్ గుర్తించింది. నేరుగా సినిమాకు దర్శకత ్వం వహించే అవకాశం ఇచ్చింది. ఈసారి కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయని ఆశిస్తున్నాం. నగరంలో యానిమేషన్ రంగం జోరు పెరుగుతోంది. హాలీవుడ్ చిత్రాలకు మనవాళ్లు పనిచేస్తున్నారు. అయితే ఇంతకన్నా క్రియేటివిటీ ఉన్నవాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మేళా మా అంచనాలను అందుకుంటుదని భావిస్తున్నాం. ఎందరో ప్రముఖులు.. ఈ ఆగస్ట్ ఫెస్ట్‌కు హైదరాబాద్‌తో సంబంధం ఉన్న అన్ని రంగాల ప్రముఖులను వక్తలుగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు సహా పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. చోటా భీం రూపశిల్పులు, నాట్యశాస్త్ర నిపుణులు, కళా రంగంలో నిష్ణాతులైన వారు.. ఇలా చాలామంది ఉన్నారు. వీళ్లంతా పారిశ్రామికీకరణ వైపు పడుతున్న అడుగులను వివరిస్తారు. - వనం దుర్గాప్రసాద్