రెవెన్యూ కార్యదర్శి కృష్ణ సస్పెన్షన్‌ | Revenue Secretary suspension | Sakshi
Sakshi News home page

రెవెన్యూ కార్యదర్శి కృష్ణ సస్పెన్షన్‌

Jul 28 2016 9:41 PM | Updated on Mar 28 2018 11:26 AM

రెవెన్యూ కార్యదర్శి కృష్ణను సస్సెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్‌ పద్మనాభరావు తెలిపారు.

యాచారం: రెవెన్యూ కార్యదర్శి కృష్ణను సస్సెన్షన్‌ చేస్తూ కలెక్టర్‌ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్‌ పద్మనాభరావు తెలిపారు. యాచారం రెవెన్యూ పరిధిలోని ఓ వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఓ వ్యక్తి నుంచి యాచారం రెవెన్యూ కార్యదర్శి అయిన కృష్ణ ఫోనులో డబ్బులు అడిగిన విషయం తెలిసిందే. రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పక్షం రోజుల కింద ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. వెంటనే తహసీల్దార్‌ పద్మనాభరావు కృష్ణను కలెక్టర్‌ కార్యాలయానికి సరెండర్‌ కూడా చేశారు. విచారణ జరిపిన అనంతరం కృష్ణను సస్పెండ్‌ చేస్తూ ఈనెల 21న కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఫోనులో రైతుతో ఎందుకు సంభాషణ చేసింది, ఆ రైతు ఎందుకు ఫిర్యాదు చేశారోననే విషయమై పది రోజుల్లో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ సూచించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement