జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులు, సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు.
అనంతపురం అర్బన్ : జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులు, సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఆ దిశగా అందరూ నడవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప, తహశీల్దార్లు వరప్రసాద్, హరికుమార్, సుబ్బయ్య, వెంకటనారాయణ, సర్వే శాఖ ఏడీ మశ్ఛేంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.