ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ను కలిశారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి సోమవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా చేపట్టిన బాక్సైట్ తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 27, 28 తేదీలలో విశాఖ మన్యంలో కాంగ్రెస్ నాయకులు, ఎస్టీ ఎంపీల బృందం పర్యటించాలని నిర్ణయించినట్లు రఘవీరా తెలిపారు.
విజయవాడ కాల్ మనీ వ్యవహారం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్న ఆయన ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు. న్యాయ విచారణ జరిపించి కాల్ మనీ స్కాంతో సంబంధం ఉన్న ఎంతటి వారినైనా వదలకుండా శిక్షించాలని రఘువీరా డిమాండ్ చేశారు.