‘హోదా’ ఇచ్చేవరకు ఉద్యమం | protest for special status says lawyers | Sakshi
Sakshi News home page

‘హోదా’ ఇచ్చేవరకు ఉద్యమం

Aug 5 2016 11:52 PM | Updated on Mar 23 2019 9:10 PM

‘హోదా’ ఇచ్చేవరకు ఉద్యమం - Sakshi

‘హోదా’ ఇచ్చేవరకు ఉద్యమం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమం ఆగదని హిందూపురం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.

హిందూపురం అర్బన్‌ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమం ఆగదని హిందూపురం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బ్యానర్లు పట్టుకుని పురవీధుల గుండా ర్యాలీ చేశారు. ఈ సందర ్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హోదా ఇవ్వకుండా కుంటిసాకులు చెబుతున్నాయని విమర్శించారు.


రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో చేసిన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు నిధులు కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఇందాద్, శ్రీరామిరెడ్డి, వెంకటరెడ్డి, శివకుమార్, శ్రీరాములు, ఆశ్వర్థనారాయణ, కె.శ్రీరాములు, నాగప్ప, సిద్దు, కృష్ణమూర్తి, వెంకటేష్, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement