పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు | problems with notes cancellation | Sakshi
Sakshi News home page

పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు

Nov 25 2016 3:08 AM | Updated on Sep 4 2017 9:01 PM

పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు

పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు

పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

రామడుగు: పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ దాచుకున్న రూ. 500, వెరుు్య నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేశారు. తిరిగి విత్‌డ్రా చేసేప్పుడు సమస్యలు ఎదురవుతున్నారుు. బ్యాంకు అధికారులు చిన్న నోట్లు ఇవ్వకుండా రూ.రెండు వేల నోట్లు ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన ఈ నోట్లు తీసుకోవడం లేదని వాపోతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవీ..
 
ఇంటర్‌నెట్‌కు రావడం లేదు
ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రకటించనప్పటి నుండి నెట్ పనుల  కోసం జనాలు రావడం మానేశారు. దీనితో నెట్ బిల్లు కూడా రాని పరిస్థితి వచ్చింది. చిన్న పని కోసం వచ్చేవాళ్లు రూ.రెండు వేల నోటు పట్టుకొని వస్తున్నారు. -అమర్, ఇంటర్‌నెట్ నిర్వాహకుడు, వెదిర

పనులు నిలిపివేశాం
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం శుభ పరిణామం. రద్దు చేసిన ప్రభుత్వం  అవసరమైన నోట్లు అందజేయడంతో విఫలమైంది. దీంతో కాంట్రాక్ట్ పనులు నిలిపివేయాల్సి వచ్చింది. కూలీలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.
 -నాగుల రాజశేఖర్‌గౌడ్, కాంట్రాక్టర్, వెదిర

పొలం దున్నుకోలేకపోతున్నాం
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది, పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఉన్న వాటిని బ్యాంకులో వేశాం. తిరిగి తీసుకుంటే రూ.రెండు వేల  నోట్ ఇస్తున్నారు. ట్రాక్టర్ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడంతో దున్నేందుకు రావడంలేదు. -ద్యావ భూంరెడ్డి, రైతు, వెదిర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement